గణపురం నేటి ధాత్రి
గణపురం మండల కేంద్రంలో ముదిరాజ్ మహాసభ మండల అధ్యక్షులు బోయిని సాంబయ్య ముదిరాజ్ ప్రెస్ మీట్ తో మాట్లాడారు భూపాలపల్లి జిల్లా లో భవనం నిర్మాణం కొరకు ఒక ఎకరం స్థలంతో పాటు 50 లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగింది 28వ తేదీన భూమి పూజ జరుగును ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ముదిరాజ్ మహాసభ రాష్ట్ర అధ్యక్షులు శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్ ముదిరాజ్ భూపాలపల్లి శాసనసభ్యులు వెంకటరమణారెడ్డి పాల్గొననున్నారు కావున మండలంలోని ముదిరాజ్ బంధువులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా ముదిరాజ్ మహాసభ మండల అధ్యక్షులు బోయిని సాంబయ్య ముదిరాజ్ మరియు జిల్లా మత్స్యశాఖ డైరెక్టర్ చాడ కిష్ట స్వామి ముదిరాజులు తెలిపారు