సిపిఎం పార్టీ మండల కార్యదర్శి కొమరం కాంతారావు
కరకగూడెం,, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా.. నేటిధాత్రి…
తమ సమస్యల పరిష్కారానికి సిపిఎం పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో తలపెట్టిన చలో ఐటీడీఏకు కరకగూడెం మండలం నుండి పలు ఆదివాసి గ్రామాలు ప్రజలు హాజరయ్యారనీ ఈ సందర్భంగా సిపిఎం పార్టీ మండల కార్యదర్శి కొమరం కాంతారావు మాట్లాడుతూ చతిస్గడ్ నుండి బ్రతుకుతెరువు కోసం వచ్చి రెండు దశాబ్దాలకు పైబడి స్థీరనివాసం ఏర్పాటు చేసుకొని బ్రతుకుతున్న వలస ఆదివాసి గుడాలకు మౌలిక సౌకర్యాలు కల్పించాలని వారు ఈ దేశ పౌరులేనని వారికి మౌలిక సౌకర్యాల కల్పనలో ప్రభుత్వాలు పక్షపాతం చూపడం తగదని వారికి తక్షణమే పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని గ్రామాల్లో విద్యుత్తు, అంతర్గత రోడ్లు, మిషన్ భగీరథ త్రాగునీరు, విద్యా, వైద్యం లాంటి మౌలిక సౌకర్యాలు కల్పించాలని వీరికి కులం సర్టిఫికెట్లు జారీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి కళ్యాణ లక్ష్మి గృహలక్ష్మి పథకాలకు అర్హులుగా గుర్తించాలని సంబంధిత డిమాండ్లతో ఐటీడీఏ పిఓ గారిని వినతి పత్రం అందజేసి సమస్యలను తెలియజేయడం జరిగిందని తమ పరిధిలో ఉన్న సమస్యలను తక్షణమే పరిష్కరిస్తామని సానుకూలంగా స్పందించారని వారు ఈ సందర్భంగా తెలియజేశారు ఈ కార్యక్రమంలో పార్టీ మండల కమిటీ సభ్యులు కనితి రాము నాయకులు మడివి లక్ష్మయ్య, మడకం చందు, పోడియం లక్ష్మయ్య, కనితి సుందరయ్య, తాటి దేవయ్య, ముచకీ సిద్దు, వివిధ గ్రామాల ప్రజలు పాల్గొన్నారు తదితరులు పాల్గొన్నారు