అజాతశత్రువు అటల్ బిహారీ వాజ్ పాయి
జీడి మల్లేష్ జమ్మికుంట పట్టణ బిజెపి అధ్యక్షుడు
జమ్మికుంట :నేటి ధాత్రి
అటల్ బిహారీ వాజ్పేయి అజాతశత్రువు అని జమ్మికుంట పట్టణ అధ్యక్షుడు మల్లేష్ అన్నారు. అటల్ బిహారీ శతజయంతిని పురస్కరించుకొని జమ్మికుంట పట్టణ బిజెపి అధ్యక్షుడు మల్లేష్, స్థానిక బిజెపి నాయకులతో కలిసి గాంధీ చౌరస్తాలో వాజ్ పాయ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన అనంతరం జమ్మికుంట ప్రభుత్వ దవఖానలో రోగులకు పండ్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా మల్లేష్ మాట్లాడుతూ అటల్ బిహారి వాజ్ పాయ్ కర్మ యోగి,యుగ పురుషుడు, గొప్ప రాజనీతిజ్ఞుడు, నిరాడంబరుడు,
అటల్ జీ అని కొనియాడారు. అతని శత జయంతి సందర్భంగా
భారతదేశం యొక్క పురోగతి, ఐక్యత మరియు ప్రపంచ స్థాయిలో భారతదేశానికి తెచ్చిన గౌరవాన్ని, ఆయన చేసిన అసమానమైన సేవలను గుర్తు చేసారు.
ఆయన నాయకత్వం, వివేకం, దేశాభివృద్ధి పట్ల తిరుగులేని నిబద్ధత మనకు అనునిత్యం స్ఫూర్తినిస్తూనే ఉన్నాయని, ఈ ప్రత్యేక సందర్భంగా ఆయన అపురూపమైన వారసత్వం మరియు ఆయన మనందరిలో నింపిన విలువలు భావితరాలకు గుర్తుంటాయని, ఆయన ఆశయ సాధన కోసం బిజెపి కార్యకర్తలు ఆయన చూపిన విలువలతో కూడిన బాటలో ప్రయాణించాలని జీడి మల్లేష్ బిజెపి కార్యకర్తలకు
పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు జీడిమల్లేష్, కంకణాల రామారెడ్డి, దొంతుల రాజకుమార్, కైలాస్కోటి గణేష్, ఇటికాల సరూప, మోతే స్వామి, తూడి రవిచంద్ర రెడ్డి,బచ్చు శివన్న, రాకేష్ ఠాగూర్,గండికోట సమ్మయ్య, బూరుగుపల్లి రాము, శనిగారపు రవి, రేవెల్లి శ్రీనివాస్, పొనగంటి రవి, ఊడుగుల మహేందర్,ఎ రామస్వామి, శ్రీవర్తి ప్రవీణ్, కొండపర్తి ప్రవీణ్, కన్నబోయిన బద్రి, అప్పల రవీందర్, పోలు అన్నమయ్య, పత్తి జనార్ధన్ రెడ్డి, వేముల జగన్, చిట్టిమల్ల ఉపేందర్,దాసరి వెంకట నర్సయ్య, రావుల మహిపాల్, వీణవంక శివ, తాటి కంటి మల్లేశం, కల్లూరి సదానందం, నిమ్మల శంకర్, మంథని అశోక్, అయిత సంతోష్,మిల్కూరి రాజు, ఆకుల పోశయ్య,గాజుల రాకేష్ తదితరులు పాల్గొన్నారు.