చెన్నూర్ ,నేటి ధాత్రి::
చెన్నూరు పట్టణం లో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి ఉత్సవాలను కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో చెన్నూర్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు చెన్న సూర్యనారాయణ జ్యోతిరావు పూలే సావిత్రిబాయి పూలే విగ్రహాలకు పూలదండ లు వేయడం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ జ్యోతిరావు పూలే అంధకారంలో ఉన్న భారతదేశంలో వెలుగును పంచిన మహనీయుడని ఆ కాలంలోనే మహిళల అభివృద్ధికి విద్య ఎంతో తోడ్పడుతుందని బాల్య వివాహం నిర్మూలించాలని కుల వ్యవస్థ నిర్మూలించాలని పోరాడిన మహానీయుడని అని అని అన్నారు. కాంగ్రెస్ పార్టీ జ్యోతిరావు పూలే సూచించిన మార్గంలో నడుస్తూ బడుగు బలహీన వర్గాల అభ్యుదయ కోసం పార్టీ పనిచేస్తుందని అని అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు చెన్న సూర్యనారాయణ, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాజమౌళి గౌడ్, చీర్ల సుధాకర్ రెడ్డి, కుర్మా సత్యనారాయణ గౌడ్, పాతర్ల. నాగరాజు, కడవండి మహేష్, చిన్నూర్ రాజేష్, బొడ్డు రాకేష్, లింగంపల్లి మహేష్, బొమ్మ రమేష్ రెడ్డి,జడల సతీష్,నారాయణ, సుశీల్ కుమార్, చింతల శ్రీనివాస్, చెన్న వెంకటేశ్వర్,కరీం,సలీం,పోగుల లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.