7వ సిపిఆర్ఎంఎస్-ఎన్ఈ ట్రస్ట్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీ సమావేశం

ట్రస్టీ అధ్యక్షులు డైరెక్టర్ పా శ్రీ ఎన్‌వి‌కే శ్రీనివాస్

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నేటి ధాత్రి

సింగరేణి ప్రధాన కార్యాలయ కాన్ఫరెన్స్ హాల్ నందు తేదీ: 11.04.2024, గురువారం నాడు ఎన్ సిడబల్యూఏ ఉద్యోగులకు సంబంధించిన సిపిఆర్ఎంఎస్-ఎన్‌ఈ బోర్డ్ ఆఫ్ ట్రస్టీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ట్రస్టీల అధ్యక్షులు డైరెక్టర్ పా శ్రీ ఎన్‌వి‌కే శ్రీనివాస్ ముఖ్య అతిధి గా హాజరై సమావేశాన్ని ప్రారంభించారు.

ఈ సమావేశంలో ముందుగా గత ఆర్థిక సంవత్సరం 2022-23 కి సంబంధించిన ఆర్థిక లావాదేవీల సంబంధించిన ఆడిట్ రిపోర్ట్ ను ప్రవేశపెట్టి ఆమోదించారు. ఉద్యోగుల కాంట్రిబ్యూటరీ పోస్ట్ రిటైర్మెంట్ మెడికేర్ స్కీమ్ అంశంపై సమీక్ష నిర్వహించారు.

గత ఆర్ధిక సంవత్సరం నుండి ఇప్పటివరకు మారిన ట్రస్టు సభ్యుల స్థానం లో కొత్త సభ్యులను ఆమోదించి అనంతరం సి‌పి‌ఆర్‌ఎం‌ఎస్-ఎన్‌ఈ స్కీమ్ కు సంబంధించి అత్యంత కీలక అంశాలపై చర్చించి నిర్ణయాలను తీసుకోవటం జరిగినది. ప్రధానముగా ఒకవేళ విశ్రాంత ఉద్యోగులు నిర్ధేశిత క్రిటికల్ వ్యాధులలో ఏదైనా వ్యాధితో భాధపడుతున్నట్లయితే దానికయ్యే ఖర్చును విశ్రాంత ఉద్యోగికి సి‌పి‌ఆర్‌ఎం‌ఎస్ కార్డు పై ఇచ్చే 8.00 లక్షలలో నుంచి కాకుండా విడిగా చూడాలని, ఇప్పటికే సి‌పి‌ఆర్‌ఎం‌ఎస్ కార్డు పై సంబంధిత క్రిటికల్ వ్యాధుల కొరకు వాడిన మొత్తం ను మినహాయించి అర్హతను బట్టి తిరిగి 8.00 లక్షల రూపాయల ప్రయోజనం కి జమ చేయాలని నిర్ణయించటం జరిగినది.

అదే విధముగా సి‌పి‌ఆర్‌ఎం‌ఎస్-ఎన్‌ఈ కార్పస్ ఫండ్ కు రావలసిన కంట్రిబ్యూషన్ అమౌంట్ కన్నా తక్కువగా ఉందని , అన్నీ ఏరియాల గనులు మరియు డిపార్ట్మెంట్లకు తెలిపిన జాబితాలోనుండి కొంత మంది మాత్రమే షార్ట్ ఫాల్ అమౌంట్ చెల్లించారని, ఇంకా దాదాపు 300 మంది చెల్లించలేదని, రాబోవు 2 నెలల్లో గనుక చెల్లించకపోతే వారి మెడికల్ కార్డులు తాత్కాలికముగా బ్లాక్ చేయబడుతాయని తెలిపారు.

ఇంకా లైఫ్ సర్టిఫికేట్ సమర్పించని వారు వెంటనే అండ్రాయిడ్ మొబైల్ అప్ప్లికేషన్ ద్వారా కానీ, దగ్గరలోని మీ-సేవా సెంటర్ లో గాని సమర్పించి సి‌పి‌ఆర్‌ఎం‌ఎస్ కార్డ్ ను రెన్యూవల్ చేసుకోగలరని తెలిపారు.
ఈ సమావేశం లో గుర్తింపు సంగమ్ ప్రెసిడెంట్ వి.సీతారామయ్య మాట్లాడుతూ యజమాన్యం సి‌పి‌ఆర్‌ఎం‌ఎస్-ఎన్‌ఈ అసలు కంట్రిబ్యూషన్ తో పాటు వడ్డీ కూడా ట్రస్టు కు జమ చేయాలని మరియు పదవీ విరమణ పొందే ఉద్యోగులు వారి పదవీ విరమణ రోజునే సి‌పి‌ఆర్‌ఎం‌ఎస్-ఎన్‌ఈ మెడికల్ కార్డు ను ఇవ్వాలని కొరటం జరిగినది.

ఈ కార్యక్రమములో ట్రస్టీల అధ్యక్షులు డైరెక్టర్(పా & ఆపరేషన్స్) ఎన్‌వి‌కే శ్రీనివాస్ తో పాటు జి‌ఎం(పర్సనల్) వెల్ఫేర్ & ఆర్‌సి కే.బసవయ్య, గుర్తింపు సంఘం (ఏ‌ఐ‌టి‌యూ‌సి)ప్రెసిడెంట్ వి.సీతా రామయ్య, గుర్తింపు సంఘం(ఏ‌ఐ‌టి‌యూ‌సి) జనరల్ సెక్రటరీ కే.రాజ్ కుమార్, జి‌ఎం(పర్సనల్) ఈ‌ఈ& సి‌ఎస్‌ఆర్ కవితా నాయుడు, జి‌ఎం(ఐ‌టి) జి.రామ్ కుమార్ రావు, జి‌ఎం(ఎంఎస్) టి.సురేష్ బాబు, సి‌ఎం‌ఓ పి.సుజాత, కంపనీ సెక్రటరీ సునీతా దేవి, ఏ‌జి‌ఎం(పర్సనల్) కే.శ్రీనివాస రావు, ప్రాజెక్ట్ మేనేజర్ (ఈ‌ఆర్‌పి) హరప్రసాద్, డి‌జి‌ఎం(ఐ‌టి) పి.హరి శంకర్, డి‌జి‌ఎం(ఫైనాన్స్) కొమరయ్య, డి‌జి‌ఎం( పర్సనల్) అజయ్ కుమార్, ఫైనాన్స్ మేనేజర్ రాజేశ్వర రావు, డి‌వై.సి‌ఎం‌ఓ సునీల, డి‌వై.పి‌ఎం లు కే.శివ కుమార్, బి.సుశీల్ కుమార్, సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్ రామా రావు మరియు ఇతర అధికారులు మరియు సి‌పి‌ఆర్‌ఎం‌ఎస్ డిపార్ట్మెంట్ సిబ్బంది పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version