బిఆర్ఎస్ విద్యార్థి నియోజకవర్గ నాయకులు పోతు అనిల్ కుమార్
వేములవాడ నేటి ధాత్రి
వేములవాడ లో ఈనెల 27న శనివారం ట్రస్మా ఇచ్చిన బందును వెంటనే వెనక్కి తీసుకోవాలని బిఆర్ఎస్ వి నియోజకవర్గ నాయకులు పోతు అనిల్ కుమార్ డిమాండ్ చేశారు. గురువారం ఏర్పాటుచేసిన సమావేశంలో మాట్లాడుతూ విద్యార్థుల తల్లిదండ్రులు పిల్లల భవిష్యత్తు కోసం ఫీజులు కట్టి పాఠశాలలకు పంపిస్తే చదువు చెప్పకుండా ఇష్టం వచ్చినట్లు బందులు పాటిస్తే ఉపాక్షించబోమన్నారు. ట్రస్మా కు ఎం ఈఓ పూర్తిగా బందిగా మారి, ప్రవేట్ పాఠశాలలను పర్యవేక్షించడం మర్చిపోవడం సమంజసం కాదన్నారు. సరైన అధ్యాపకులు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారుని.విద్యార్థులను స్టడీ అవర్ పేరుతో రాత్రి 9 గంటల వరకు పాఠశాలల్లోనే ఉంచి విద్యార్థులపై ఒత్తిడి తీసుకరావడం కరెక్ట్ కాదాన్నారు. యూనిఫామ్ పేరుతో విద్యార్థులను మానసికంగా వేధించడం. ఒక విద్యార్థిని పేరుతో ట్రస్మా ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం సమంజసం కాదన్నారు, బందును వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో నాయకులు తుమ్మల దిలీప్, మంత సందీప్, ఎస్ కె ఫెరోజ్, ప్రమోద్. తదితరులు పాల్గొన్నారు.