జడ్చర్ల కేంద్రంలో బిజెపి జాతీయ అధ్యక్షురాలు డీకే అరుణ పర్యటన.

మహబూబ్ నగర్ జిల్లా నేటి ::ధాత్రి

మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల కేంద్రంలోని ప్రేమ్ రంగా గార్డెన్ లో నిర్వహించిన నూతన యువ ఓటర్ల కార్యక్రమానికి మాజీ మంత్రి,బిజెపి జాతీయ అధ్యక్షురాలు డీకే అరుణ, ఎక్స్ మినిస్టర్ దాసు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో డీకే అరుణ మాట్లాడుతూ. నియోజకవర్గంలోని నూతన యువత ప్రతి ఒక్కరూ ఓటరు నమోదు చేసుకోవాలని అన్నారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ప్రతి ఒక్క యువత బిజెపి వైపు మొగ్గు చూపాలని ఆమె సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షులు కొంగలి శ్రీకాంత్, తిరుపతయ్య, నియోజకవర్గంలోని బిజెపి నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version