ఉద్యమ కళాకారునికి నిరాశే మిగిలింది.
రాయికల్ జూలై 19, నేటి ధాత్రి: . .
మండలం అల్లీపూర్ గ్రామానికి చెందిన బోదనపు నటరాజ్ తెలంగాణ రాష్ట్ర సాధనలో ఎన్నో వేదికల పైన ధూంధాం కార్యక్రమాలలో పాటలు పాడి,ఆటలాడి తన వంతు పాత్ర పోషించడం జరిగింది.గత ప్రభుత్వంలో కళాకారునిగా సాంస్కృతి సారధి ఉద్యోగం రాకపోగా,ఈ ప్రభుత్వంలో అర్హత కలిగి ఉండి కూడా ఇందిరమ్మ ఇండ్ల మంజూరులో సొంత ఇంటి కల నెరవేరక పోయింది. కావున ఇందిరమ్మ ఇండ్ల మంజూరులో తనకు న్యాయం చేయగలరని అధికారులను కోరడమైనది.