ప్రజా వ్యతిరేక బిజెపి పార్టీకి తగిన బుద్ధి చెప్పాలి

ఎన్నికలప్పుడే మార్నింగ్ వాకుల పేరిట నాన్ లోకల్ అభ్యర్థులు వస్తారు

ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విజయానికి తోడ్పాటు అందించాలని పిలుపు

వేములవాడ నేటిధాత్రి

ప్రజా వ్యతిరేక విధానాలు అమలు చేస్తున్న బిజెపి పార్టీకి ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని ప్రభుత్వ విప్, వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ అన్నారు…

బుధవారం వేములవాడ పట్టణంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ లోక్ సభ ఎన్నికల్లో మొదటి విడత పూర్తి కాగానే ప్రజానాడి భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా ఉందని తెలియగానే భారతదేశ ప్రధానమంత్రి హోదాలో నరేంద్ర మోడీ మాట్లాడే మాటలు గమనిస్తే ఈ రోజు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రచించిన చట్ట ప్రకారమే మన నిధులను,విధులను తీసుకోవాల్సిన పరిస్థితి ఉందని తెలిసి భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన ప్రధానమంత్రి హోదాలో ఉన్నటువంటి వారు మొదటి దశ ఎన్నికల ప్రక్రియ పూర్తయిన తర్వాత ప్రజలు నాడీ భారతీయ జనత వ్యతిరేకంగా ఉందని తెలిసిన తర్వాత బాగోద్వేగంతోని ధనాన్ని ఒకే వర్గానికి పంచుతారని చెప్పే మాటలు కానీ, తాళిబొట్లను కూడా అమ్ముతారని ఒక భావోద్వేగాన్ని ప్రజల్లో తీసుకుపోవడం చూస్తే నైతిక విజయం కాంగ్రెస్ పార్టీదే, ఇండియా కూటమిదే అన్నారు..

10 సంవత్సరాల భాజపా ప్రజా వ్యతిరేక పాలన వాళ్లకు కనిపిస్తుంది కాబట్టే రెచ్చగొట్టే విధంగా వాళ్లు ప్రకటన చేయడం దేశంలోనే ప్రజలందరికీ ఒక భావోద్వేగంతో తీసుకుపోవాలని చూస్తున్నారన్నారు…

గతంలో మతం పేరిట, పుల్వామా ఘటన పేరిట ఎన్నికలకు ముందే పాకిస్తాన్ కి వెళ్లి ఉగ్రవాదులను మట్టు పెట్టినమని ఒక భావోద్వేగాన్ని తీసుకొని అధికారంలోకి రావాలని రెండుసార్లు వారు సాధించారని కానీ మూడోసారి ప్రజలు వారి నిజస్వరూపాన్ని గమనించారన్నారు…

తెలంగాణ భావోద్వేగం పేరిట బీఆర్ఎస్ పార్టీ ,రైతుబంధు, పెన్షన్ పేరిట రెండవసారి తెలంగాణలో గెలిచిన బిఆర్ఎస్ పార్టీ నిజస్వరూపాన్ని గత పది సంవత్సరాల పాలనను చూసి ఏ విధంగా అయితే ప్రజలు పక్కన పెట్టారో, దేశంలో కూడా బీజేపీ పార్టీని పక్కన పెడతారన్నారు..

బిజెపి వారు ఏట నిరుద్యోగులకు రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానని ఇవ్వలేదని, జన్ ధన్ ఖాతాల్లోకి 15 లక్షలు ఇస్తామని ఇవ్వలేరని, నిత్యవసర ధరల పెరుగుదలకు కారణమయ్యారన్నారు..

ప్రశ్నించే వారిని తొక్కేస్తూ సుమారుగా 140 మంది ఎంపీలను బహిష్కరించిన బిజెపి పార్టీకి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి కాబట్టే వారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారన్నారు.. వారు మాట్లాడే మాటలను తప్పుపడుతూ ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు కూడా చేశామన్నారు…

ప్రజల్లో భావోద్వేగాన్ని నింపి ఓట్లు దండుకోవాలని చూస్తున్నా వారికి తగిన బుద్ధి చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు.. దేశవ్యాప్తంగా జరుగుతున్న ఎన్నికల్లో ప్రజలందరూ కూడా ఇండియా కూటమికి రాహుల్ గాంధీ నాయకత్వం వహిస్తున్నారు కాబట్టి కరీంనగర్ లోక్సభలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా, తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను చూసి ప్రజలందరూ కూడా మీ అమూల్యమైన ఓటును చేతి గుర్తుపై వేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విజయానికి తోడ్పాటు అందించాలని అన్నారు..

వేములవాడ పట్టణంలో నాన్ లోకల్ నాయకులు వచ్చి మార్నింగ్ వాక్ ల పేరిట బాగున్నారా అని మాట్లాడే మాటలను ప్రజలు గమనించాలని అన్నారు..

10 సంవత్సరాలు అధికారంలో ఉండి పేద ప్రజల గురించి పట్టించుకోని వీరు, ఈ ప్రాంతంలోని దేవాలయానికి ఏటా 100 కోట్లు ఇస్తానని ఇవ్వని వీరు, ముంపు గ్రామాల సమస్యలు పరిష్కారం చేస్తామని చేయని వీరు, శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు, మర్రిపల్లి రిజర్వాయర్, ఆశ రెడ్డిపల్లి ప్రాజెక్ట్, ఎర్ర చెరువు పటేల్ చెరువు, కలిగోట సూరమ్మ ప్రాజెక్ట్ ఇలా రైతులకు ఉపయోగపడే ఏ ప్రాజెక్టు పూర్తి చేయకుండా ఈరోజు ఎన్నికల రాగానే ప్రజలు గుర్తుకు వచ్చి మార్నింగ్ వాకుల పేరిట వస్తున్నారని, ఎన్నికల రాగానే పెళ్లిలు పేరంటాలకు వచ్చే విల్లు మనకు కావాలా నియోజకవర్గ ప్రజలు ఆలోచించాలన్నారు..

ప్రతి కార్యక్రమంలో, మీ కష్టసుఖాల్లో మీ వెంట ఉండే నాయకత్వాన్ని గమనించి మీ అమూల్యమైన ఓటును కాంగ్రెస్ పార్టీ కి వేయాలన్నారు.. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ బింగి మహేష్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సాగరం వెంకటస్వామి, పట్టణ ప్రధాన కార్యదర్శి కనికరపు రాకేష్, నాయకులు దాడి మల్లేశం యాదవ్, అంబడి చందు యాదవ్, మేండే రాజు, ప్రభాకర్ తదితరులు ఉన్నారు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *