మతోన్మాదానికి ప్రత్యామ్నాయం మార్క్సిజమే

# రాజ్యాంగాన్ని పరిరక్షించడం తక్షణ కర్తవ్యం

# యంసిపిఐ(యు) జాతీయ ప్రధాన కార్యదర్శి మద్ధికాయల అశోక్ ఓంకార్
# యంసిపిఐ(యు) పార్టీ జిల్లా కమిటీ అధ్వర్యంలో ఒక్క రోజు వర్క్ షాపు

నర్సంపేట/దుగ్గొండి,నేటిధాత్రి :

మత రాజకీయాలను ప్రజలు తిరస్కరించాలని, ప్రజా సమస్యలకు ప్రత్యామ్నాయం మార్క్సిజమేనని యంసీపీఐ(యు) జాతీయ ప్రధాన కార్యదర్శి మద్దికాయల అశోక్ ఓంకార్ అన్నారు.శనివారం యంసిపిఐ(యు) జిల్లా కమిటీ వర్క్ షాప్ కార్యక్రమం జిల్లా నాయకుడు కుసుంబ బాబురావు అధ్యక్షతన దుగ్గొండి మండలంలోని గిర్నిబావిలోని జిబిఆర్ ఫంక్షన్ హాల్ లో జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన అశోక్ ఓంకార్ మాట్లాడుతూ ప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం మత పరమైన రాజకీయాలకు పూనుకుందని అన్నారు.గత పది సంవత్సరాలుగా కార్పొరేట్,పెట్టుబడి దారి ఆర్థిక విధానాలతో పాటు మతోన్మాద విధానాలతో పాలన చేస్తూ దేశ ప్రజలపై ఆర్థిక భారాలను వేస్తూ ముఢా విశ్వాసాలతో ప్రజలను మానసిక వికలాంగులుగా చేస్తుందని ఆరోపించారు.మతాన్ని వ్యక్తిగత విశ్వాసం నుండి మతం అంటే రాజకీయం అనే స్థాయికి బి జె పి పార్టీ ఎదిగిందని,ఇది భారత ప్రజాస్వామ్యానికి,లౌకిక విధానానికి ప్రమాదమని ఆరోపించారు.మతం పేరుతో బిజెపి ని లౌకికత్వం పేరుతో కాంగ్రెస్ ను అలాగే వీటిని బలపర్చిన పెట్టుబడి దారి, బూర్జువా పార్టీలను ప్రజలు తిరస్కరించాలని పిలుపునిచ్చారు.దేశ వ్యాపితంగా తాజా రాజకీయ పరిణామలపై అలాగే రాబోయే పార్లమెంట్ ఎన్నికలలో తన విధి విధానాలను చర్చించేందుకు పిబ్రవరి 2 నుండి 5 వరకు తమిళనాడు రాష్ట్రం కన్యాకుమారిలో యంసిపిఐ(యు) కేంద్ర కమిటీ సమావేశాలు జరుపుతున్నామని తెలియజేశారు. అనంతరం యంసిపిఐ(యు) జిల్లా కార్యదర్శి పెద్దారపు రమేష్ మాట్లాడుతూ జిల్లాలో ప్రజాసంఘాలను బలోపేతం చేయాలని,రాష్ట్రంలో వామపక్ష ఐక్యత,సామాజిక న్యాయ సాధనకోసం సమావేశం తగిన నిర్ణయాలను చేసిందని అన్నారు.మతోన్మాద,పాసిస్టు విధానాలపై జనవరి 30న రాష్ట్రవ్యాపి ఆందోళన చేయాలని, ఫిబ్రవరి 14న అమరజీవి తాండ్ర కుమార్ ద్వితీయ వర్ధంతిని రాష్ట్రా వ్యాపితంగా జరుపాలని కోరారు. అలాగే ఉమ్మడి కార్మిక సంఘాల,యస్కెయం ల పిబ్రవరి 16న గ్రామీణ బంద్ కార్యక్రమానికి యంసిపిఐ(యు) సంపూర్ణ మద్దతు తెలుపుతూ జయప్రదం చేయాలని కోరారు.ఈ సమావేశంలో పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు గోనె కుమారస్వామి, రాష్ట్ర కార్యదర్శి వర్గసభ్యులు మంద రవి, రాష్ట్ర కమిటీ సభ్యులు నర్ర ప్రతాప్, నాగెల్లి కొమురయ్య, వంగల రాగసుధ, యుపీఎన్ఎం రాష్ట్ర కార్యదర్శి కన్నం వెంకన్న, జిల్లా నాయకులు సుంచు జగదీశ్వర్, కొత్తకొండ రాజమౌళి, సింగతి మల్లికార్జున్, కందికొండ కుమారస్వామి, కలకొట్ల యాదగిరి, జన్ను రమేష్, బత్తిని కుమారస్వామి, గటికె జమున, ఐతం నాగేష్, గాజుల వెంకటయ్య, ఎల్లబోయిన రాజు, కరుణాకర్, బుడిమే సురేందర్, అల్లి సాబ్, ఐలోని గణేష్ తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version