కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను తప్పక నెరవేరుస్తుంది-ఎమ్మెల్యే
పరకాల నేటిధాత్రి హనుమకొండ జిల్లా పరకాల మండలంలోని పోచారం,పైడిపల్లి గ్రామాలలో నూతన నిర్మించిన పంచాయతీ భవనాలను శనివారం పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి ప్రారంభించారు.అనంతరం ఆయా గ్రామాలలో ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి నాయకత్వం నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు కృషి చేయడం జరుగుతుందని టిపిఎస్సి చైర్మన్ నియమించి ప్రక్షాళన చేయడం జరిగిందని సంవత్సరంలోగా ఉద్యోగాల భర్తీకి చర్యలు తీసుకుంటున్నారని అన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీ ల హామీలను ఒక్కొక్కటిగా నెరవేర్చబోతుందని ప్రాధాన్యత క్రమలో ప్రతి గ్యారెంటీ హామీని బాధ్యతలు తీసుకొని అమలు చేస్తామని అన్నారు.రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా పది లక్షల వరకు లబ్ది,మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణిస్తున్నారని గుర్తు చేశారు.అదేవిధంగా త్వరలోనే రేషన్ కార్డులు,కొత్త ఇండ్లు, పింఛన్లు,రుణమాఫీ లాంటి పథకాలను అమలు చేసి చూపిస్తుందని రేవూరి ప్రకాష్ రెడ్డి భరోసా ఇచ్చారు.గ్రామాల్లో ప్రజలు కలిసిమెలిసి జీవించాలని అందరూ ఐకమత్యంగా ఉన్నప్పుడే గ్రామం అభివృద్ధి చెందుతుందని ఎమ్మెల్యే సూచించారు.గత బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్లపాటు గ్రామ పరిపాలనను నిర్వీర్యం చేసిందని విమర్శించారు. గ్రామపంచాయతీలో ప్రజలను పాలనపరంగా పెట్టిందని, చిల్లిగవ్వ బిల్లులు చెల్లించక సర్పంచులకు గ్రామస్తులకు ముప్పు తిప్పలు పెట్టారని గుర్తు చేశారు.కొత్త ప్రభుత్వం ఇప్పుడు కొలువుదిరిందని అందరికీ అన్ని సౌకర్యాలను సమకూర్చుతామని పేర్కొన్నారు.ప్రజలు ఈ ప్రజా ప్రభుత్వానికి తోడ్పాటు అందించాలని ఆయన కోరారు.ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు అధికారులు తదితరులు పాల్గొన్నారు.