చేతి గుర్తుకు ఓటు వేసి కడియం కావ్యను గెలిపించండి
కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి గాజర్ల అశోక్
శాయంపేట నేటి ధాత్రి:
పదేళ్ల ప్రధాని మోడీ పాలనలో హిందూ, ముస్లిం ప్రజల మధ్య వైశ్యామ్యాలను పెంచుతూ మూడోసారి తమకే దేశంలో అధికారం కావాలని కోరుతున్న బిజెపికి మళ్ళీ అధికారం ఇస్తే నియంతృత్వ పాలన కొనసాగుతుందని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి గాజర్ల అశోక్ అన్నారు. మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ అధ్యక్షుడు దూదిపాల బుచ్చిరెడ్డి అధ్యక్షతన గురువారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో సిపిఐ, సిపిఎం నాయకులు రాజ్ కుమార్, బందు సాయిలు తో కలిసి రాష్ట్ర అధికార ప్రతినిధి గాజర్ల అశోక్ మాట్లాడారు. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు తగ్గిన పెట్రోల్, డిజిల్ ధరలతో పాటు నిత్యవసర సరుకుల ధరలను ఎందుకు కట్టడి చేయలేదని ప్రశ్నించారు. మోడీ ప్రభుత్వం మణిపూర్లో మహిళలను అవహేళన చేస్తూ రోడ్లపై తిప్పిందని, అంతేకాకుండా అనేక మందిపై అత్యాచారాలు జరిపించి హత్యలు చేపించిందని విమర్శించారు. కేంద్రంలో అధికారంలోకి రావడానికి ముందు సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు, రైతులు ఆదాయం రెట్టింపుచేయడం, నల్లధనాన్ని వెలికి తీయడం, ఇల్లు లేని పేదలకు సొంతిల్లు నిర్మాణం ఇలాంటి హామీలు ఇచ్చి కేంద్రం పదేళ్ల కాలంలో విస్మరించిందని ఆరోపించారు. ఈనెల 13న జరిగే పార్లమెంటు ఎన్నికల్లో బిజెపిని చిత్తుగా ఓడించి, రాహుల్ గాంధీ ప్రధాని చేయడమే లక్ష్యంగా పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ కడియం కావ్యను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కేంద్రంలో బిజెపి అధికారంలోకి వచ్చినప్పటి నుండి ప్రజా సమస్యలను పట్టించుకోకుండా కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా వ్యవహరిస్తూ ప్రజా సంపాదన మొత్తం ప్రైవేటుపరం చేస్తూ దేశాన్ని సంక్షోభాన్ని గురి చేస్తుందని సిపిఐ, సిపిఎం నాయకులు బంద్ సాయిలు, రాజ్ కుమార్ ఆరోపించారు. సిపిఐ సిపిఎం పార్టీలు మద్దతు మధ్య తెలుపుతున్న ఇండియా కూటమి అభ్యర్థి డాక్టర్ కడియం కావ్యం నియోజకవర్గం ప్రజలు ఆశీర్వదించి గెలిపించాలని కోరారు. ఈ సమావేశంలో మండల అధికార ప్రతినిధి చిందం రవి, అయ్యన్ టి యు సి మండల అధ్యక్షుడు మారేపల్లి రాజేందర్, నాయకులు వరదరాజు, వల్పదాసు రాము, ఎండి సాదిక్, కమ్యూనిస్టు నాయకులు అనుకారి అశోక్, ఎండి ఉస్మాన్, రమ, తదితరులు పాల్గొన్నారు.