బి.ఆర్.ఎస్ పార్టీ నాయకులు
సిరిసిల్ల, మే – 9(నేటి ధాత్రి):
శుక్రవారం సాయంత్రం 5 గంటల నుండి 7 గంటల వరకు సిరిసిల్ల పట్టణంలో తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి బి.ఆర్.ఎస్ పార్టీ అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ముఖ్య అతిథులుగా నిర్వహించనున్న బస్సు యాత్రలో భాగంగా నేతన్న చౌక్ లో నిర్వహించనున్న రోడ్ షో కార్యక్రమంలో రైతులు, పవర్లూమ్ కార్మికులు, అన్ని వర్గాల ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని గురువారం బిఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయం తెలంగాణ భవన్ లో బి.ఆర్.ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహించి పిలుపునివ్వడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో బి.ఆర్.ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య, పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి,జిల్లా నాయకులు, బి.ఆర్.ఎస్ కౌన్సిలర్లు, పట్టణ నాయకులు తదితరులు పాల్గొన్నారు.