నావార్డు కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు
7వ వార్డు అభ్యర్థి సునిల్ పావుశెట్టి
పరకాల,నేటిధాత్రి
ఈ నెల 11న జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో నాపై నమ్మకంతో నా వెంటే ఉండి మీ అమూల్యమైన ఓటుతో నన్ను ఆశీర్వదించిన మా 7వ వార్డు ప్రజలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నానని పావుశెట్టి సునీల్ అన్నారు.ఈ సందర్బంగా మాట్లాడుతూ నన్ను గెలిపించేందుకు నా కోసం తపన పడిన నా వార్డు ఓటర్ల రుణం తీర్చుకునే అవకాశం ఇస్తారని ఆశిస్తున్నాను.నా గెలుపు కోసం కష్టపడ్డ ప్రతి అక్క,అన్న,చెల్లి,తమ్ముడు, అమ్మ,నాన్న,అమ్మమ్మ, నానమ్మ,తాతయ్య లు నా వెంటే నిలబడ్డ ప్రతి ఒక్కరిని నేను ఎప్పటికి మరచిపోను అభివృద్ధి,సంక్షేమ పథకాలను ఇప్పించడంతో పాటువార్డు ప్రజల కష్టసుఖాల్లో వారికి అండగా వారి మనిషిగా ఉంటాను.మీకు మరింత సేవ చేసే అవకాశం నాకు కల్పిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని అన్నారు.
