నేటి ధాత్రి కథలాపూర్
జగిత్యాల జిల్లా
కథలాపూర్ మండలంలోని జడ్పీహెచ్ఎస్ తక్కల్లపల్లి పాఠశాలలో పదో తరగతి చదువుతున్న విద్యార్థిని
డి. సింధు U-16 విభాగంలో 60 మీటర్స్ & 600 మీటర్స్ పరుగు పందెంలో రెండు విభాగాల్లో జిల్లా స్థాయిలో మొదటి బహుమతి గెలుచుకొని రాష్ట్రస్థాయికి సెలెక్ట్ అయినట్లు జగిత్యాల జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ ఎలేటి ముత్తయ్య రెడ్డి గారు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పోటీలు ఈనెల 19 & 20వ తేదీల్లో హైదరాబాదులోని ఓయూ క్యాంపస్ గ్రౌండ్ లో నిర్వహిస్తున్నారు. రాష్ట్ర స్థాయికి సెలెక్ట్ అయిన సింధును మరియు రాష్ట్రస్థాయికి సెలెక్ట్ కావడానికి కృషి చేసిన పిఈటి రాజేష్ సార్ ను ప్రధానోపాధ్యాయులు రవీందర్ సార్ మరియు ఉపాధ్యాయులు, గ్రామ పెద్దలు అభినందించారు.
