ముగిసిన 129 పురపాలికల పదవీకాలం

ప్రారంభమైన ప్రత్యేక అధికార్ల పాలన

కార్పొరేషన్లకు ఐఏఎస్‌ స్థాయి అధికార్లు

మున్సిపాలిటీలకు ఆర్డీవో స్థాయి అధికార్లు

ఇప్పటికే ప్రత్యేక అధికార్ల పాలనలో గ్రామ పంచాయతీలు

ప్రస్తుతం ఫిరాయింపులతో మెజారిటీ పురపాలికలు కాంగ్రెస్‌ ఆధీనంలో

రేవంత్‌కు గట్టి సవాలు విసరనున్న స్థానిక ఎన్నికలు

తెలంగాణలోని 120 మున్సిపాలిటీలు, 9 మున్సిపల్‌ కార్పొరేషన్ల పదవీ కాలం ఈ నెల 26తో ముగిసింది. ఇప్పటికే గ్రామ పంచాయతీలు, మండల పరిషత్‌ల కాలపరిమితి ముగియడంతో ప్రత్యేక అధికార్ల పాలన కొనసాగుతోంది. 27వ తేదేనుంచి పట్టణ స్థానిక సంస్థల్లో అధికార్ల పాలన సాగనుంది. అయితే క్రితంసారి రెండు రోజులు ఆలస్యంగా ఎన్నికలు జరగడంతో కరీంనగ ర్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ గడువు దానికి అనుగుణంగా జనవరి 28వ తేదీతో ముగుస్తుంది. ఇక కార్పొరేషన్లకు ఐఎఎస్‌ స్థాయి అధికార్లు, మున్సిపాలిటీలకు ఆర్డీఓ స్థాయి అధికార్లు ప్రత్యేక అధికార్లుగా వ్యవహరిస్తారు. 2022 జనవరి 22న తెలంగాణలోని 120 మున్సిపాలిటీలకు 9 కా ర్పొరేషన్లకు ఎన్నికలు జరిగాయి. కరీంనగర్‌ మున్సిపాలిటికీ మాత్రం జనవరి 24న ఎన్నిక జరి గింది. అప్పట్లో 77 మున్సిపాలిటీలను ఏకగ్రీవ ఎన్నికతో భారాసా స్వాధీనం చేసుకొని రికార్డు సృష్టించింది. మొత్తంమీద మెజారిటీ మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు భారాసా (టీఆర్‌ఎస్‌) కైవస కావడం గమనార్హం. పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల తీరు పరిశీలిస్తే, ఇవన్నీ దాదాపు అధికారం లో ఏపార్టీ వుంటే దాని ఖాతాలోకే వెళ్లిపోవడం సహజంగా జరుగుతూ వచ్చింది. ఇదే తీరును అనుసరిస్తూ, మెజారీటీ మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు భారాసా ఖాతాలోకి వెళ్లిపోయాయి.

కొనసాగిన ఫిరాయింపుల ట్రెండ్‌

2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అధికారంలోకి రావడంతో అదే ట్రెండ్‌ను అనుసరిస్తూ చా లామున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఫిరాయింపులు అవిశ్వాస తీర్మానాల నేపథ్యంలో దాదాపుగా ఇవన్నీ కాంగ్రెస్‌ ఒడిలోకి చేరిపోయాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీలు ప్రత్యక్షంగా పాల్గనవు. కాకపోతే అభ్యర్థులకు తమ మద్దతు కొనసాగిస్తాయి. ఫిరాయింపులకు ఇదీ ప్రధాన కారణం.ఇప్పుడు జీహెచ్‌ఎంసీ మేయర్‌ విజయలక్ష్మి సహా రాష్ట్రంలోని చాలా కార్పొరేషన్ల మేయర్లు, ము న్సిపల్‌ ఛైర్మన్లు కాంగ్రెస్‌లో చేరిపోయారు. ఇక కరీంనగర్‌ కార్పొరేషన్‌ మేయర్‌ సునీల్‌రావు బీజేపీ తీర్థం పుచుకోవడం తాజా పరిణామం.
జీహెచ్‌ఎంసీ కాలపరిమితి మరో ఏడాదికాలం వుండగా ఖమ్మం, వరంగల్‌ కార్పొరేషన్లు, కొత్తగాఏర్పాటైన మరో ఐదు మున్సిపాలిటీల కాలపరిమితి మరో ఏడాదిన్నర కాలం వుంది. జీహెచ్‌ఎం సీ ఎన్నికలు 2020 డిసెంబర్‌ 1న జరగ్గా, ఖమ్మం, వరంగల్‌ కార్పొరేషన్లు, జడ్చర్ల, అచ్చంపేట,నకిరికల్‌, కొత్తూరు, సిద్దిపేట మున్సిపాలిటీలకు 2021 ఏప్రిల్‌ 30న ఎన్నికలు జరిగాయి. ఈ మొత్తం ఎనిమిది పురపాలికల పదవీకాలం ఏడాదిన్నర వరకు వుంది. ఇదిలావుండగా మహబూబ్‌ నగర్‌, మంచిర్యాల మున్సిపాలిటీలను కార్పొరేషన్లుగా అప్‌గ్రేడ్‌ చేస్తూ, మరో 12 కొత్త మున్సి పాలిటీలను ఏర్పాటు చేస్తూ ప్రస్తుత కాంగ్రెస్‌ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఔటర్‌ రింగ్‌ రోడ్డుకు లోపలివైపు వున్న 50 గ్రామాలను సమీప మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ప్రభుత్వం కలిపేసింది. వచ్చే పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల నాటికి ఓఆర్‌ఆర్‌ పరిధిలోని అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను కలిపేసి, నాలుగు లేదా ఐదు కార్పొరేషన్లు ఏర్పాటు చేయాలన్నది ప్రభుత్వ ఉద్దేశం. ఇదిలావుండగా కొత్తగా అమల్లోకి వచ్చిన మున్సిపల్‌ చట్టాల ప్రకారం ఎన్నికలు జరపాల నుకున్నట్లయితే, కాలపరిమితి ఇంకా మిగిలున్న పట్టణ సంస్థలను కూడా రద్దుచేసి, ఏకకాలంలో రాష్ట్రం మొత్తం మీద పురపాలికలకు ఎన్నికలు జరిపే అవకాశం లేకపోలేదు.

జీహెచ్‌ఎంసీలో బలాబలాలు

ప్రస్తుతం జి.హెచ్‌.ఎం.సి.లో 146మంది కార్పొరేటర్లు, 50మంది ఎక్స్‌ అఫిసియో సభ్యులు కలిపి 196మంది వున్నారు. ప్రస్తుతం బీఆర్‌ఎస్‌కు 42 మంది కార్పొరేటర్లు, 29మంది ఎక్స్‌అఫిసియో సభ్యులు కలిపి 71 మంది సభ్యుల బలం వుంది.గత ఎన్నికల్లో కాంగ్రెస్‌ కేవలం రెండు సీట్లలోనే గెలిచింది. లింగోజీ గూడ బీజేపీ కార్పొరేటర్‌ ఆకుల రమేష్‌గౌడ్‌ మృతితో ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ గెలిచి ముగ్గురయ్యారు. తర్వాతి కాలంలో బీజేపీ నుంచి ముగ్గురు, బీఆర్‌ఎస్‌ నుంచి 18మంది చేరడంతో కాంగ్రెస్‌ బలం 24కు పెరిగింది. ఎంఐఎం 44 స్థానాల్లో గెలవగా ఒక కార్పొరేటర్‌ మరణించారు. ఇద్దరు రాజీనామాలు చేయ డంతో 41 మంది వున్నారు.బీజేపీ 48 స్థానాలో గెలుపొందగా, మొదట్లోనే ఒక కార్పొరేటర్‌ మరణించడంతో సభ్యుల సంఖ్య 47కు తగ్గింది. అనంతరం గుడిమల్కాపూర్‌ కార్పొరేటర్‌ మరణించడం మరికొందరు పార్టీలు మారడంతో ప్రస్తుత బీజేపీ బలం 39గా వుంది. బీఆర్‌ఎస్‌ 56 సీట్లలో గెలిచింది. బీజేపీ నుంచి నలుగురు చేరడంతో వీరి సంఖ్య 60కి చేరింది. తర్వాత 18మంది కాంగ్రెస్‌లోకి వెళ్లడంతో ప్రస్తుతం 42మంది వున్నారు.

స్థానిక ఎన్నికలపై రేవంత్‌ ఆసక్తి

త్వరలో ఈ స్థానిక సంస్థలన్నింటికీ ఎన్నికలు నిర్వహించక తప్పదు. స్థానిక సంస్థల్లో వెనుకబడినవర్గాలకు (బీసీలకు) రిజర్వేషను పెంచే విషయంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చాలా ఆసక్తి కనబరుస్తున్నారు. ముఖ్యంగా ఇటీవల రాష్ట్రంలో చేపట్టిన కులగణన నేపథ్యంలో, బీసీ వర్గాలకు అధిక సీట్లు రిజర్వ్‌ చేయాలన్న ఉద్దేశం ఆయనలో స్పష్టంగా కనిపిస్తోంది. కానీ విఘ్నేశ్వరుడి పెళ్లికివెయ్యి విఘ్నాలు అన్న చందంగా ఈ స్థానిక సంస్థల ఎన్నికలకు అనేకఅడ్డంకులు ఎదురవుతున్నా యి. వీటన్నింటిని అధిగమిస్తే తప్ప ఎన్నికలు జరిగే అవకాశం లేదు.

పంచాయతీల్లో బీసీ రాజకీయం

ఇక గ్రామ పంచాయతీల విషయానికి వస్తే కాలపరిమితి ముగిపోతున్న తరుణంలో సర్పంచ్‌లు మరో ఆర్నెల్ల పొడిగింపు కోరుతూ చేసిన విజ్ఞప్తిని రేవంత్‌ ప్రభుత్వం తిరస్కరించింది. వీరిలో అత్యధికసంఖ్యాకులు బీఆర్‌ఎస్‌కు చెందినవారుకావడం వల్ల , అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ సాధించిన విజయాలకు, స్థానిక ఎన్నికల్లో వీరు గండి కొడతారన్న భయమే రేవంత్‌ ప్రభుత్వం వారి అభ్యర్థనను తిరస్కరించడానికి ప్రధాన కారణం. అయితే ప్రభుత్వం మాత్రం బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం తీసుకొచ్చిన పంచాయతీరాజ్‌ చట్టం ప్రకారం పొడిగింపు సాధ్యంకాదని స్పష్టం చేసింది. బీఆర్‌ఎస్‌ కూడా బీసీ రిజర్వేషన్లు ఒక కొలిక్కిరాకుండా ముందుకు పోవాలన్న ఉద్దేశంతో లేదు. బీసీ రిజర్వేషన్లను తనకు రాజకీయంగా అనుకూలంగా మార్చుకోవాలన్నది పార్టీ వ్యూహం. ప్రస్తు తం తెలంగాణ రాష్ట్రంలోని 32 గ్రామీణ జిల్లాల్లో, 12769గ్రామపంచాయతీలు, 32 జిల్లా పరిషత్‌ లు, 540 మండల పరిషత్‌లున్నాయి. ఇక గ్రామీణ ఓటర్ల సంఖ్య 2,04,59164. గత పంచాయతీ ఎన్నికలు 2019, జనవరి నెలలో మూడు దశల్లో జరిగాయి.

సత్వర ఎన్నికలు తప్పదు

ఇప్పుడు బీసీ రిజర్వేషన్లను పెంచడం ఒక ఎత్తయితే, స్థానిక సంస్థలకు కేంద్రంనుంచి నిలిచిపో యిన నిధులను తిరిగి పొందాలంటే ప్రభుత్వం సాధ్యమైనంత త్వరగా ఎన్నికలు నిర్వహించడం తప్పనిసరి. ఇందుకు ముఖ్యమంత్రి, అధికార్లను సమాయత్తం చేస్తూ స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజ ర్వేషన్ల అమలుకు అనుసరించిన విధానాలకు సంబంధించిన కాలక్రమ పట్టికను తయారుచేసిముందుకెళ్లాలని ముఖ్యమంత్రి అధికార్లకు సూచించారు. ఈ ఏడాదిలోపు జరుగబోయే స్థానిక సంస్థలు మరి యు జీహెచ్‌ఎంసీ ఎన్నికలు రేవంత్‌ ప్రభుత్వానికి గట్టి పరీక్షా కాలంగా చెప్పాలి. కాంగ్రెస్‌లో ఇప్పటివరకు ఎదురులేకుండా దూసుకెళుతున్న రేవంత్‌, విపక్ష బీఆర్‌ఎస్‌ మూలాల ను దెబ్బతీసే వ్యూహాన్ని అమలు చేస్తున్నారు. ముఖ్యంగా కేటీర్‌పై ఏసీబీ, ఈడీ కేసులను నమోదు చేయించి కేసీఆర్‌ కుటుంబం అవినీతి అక్రమాలకు పాల్పడిరదని నిరూపించి, స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించాలన్నది రేవంత్‌ వ్యూహంగా కనిపిస్తోంది.
తెలంగాణ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ ప్రెసిడెంట్‌ మహేష్‌కుమార్‌ గౌడ్‌ కూడా గత సెప్టెంబర్‌నెల లో కరీంనగర్‌, వరంగల్‌, ఖమ్మం జిల్లాలకు సంబంధించి పార్టీ పనితీరు, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు సంసిద్ధతపై సమావేశం నిర్వహించి, పార్టీ నాయకత్వాల అభిప్రాయాలు తెలుసుకున్నారు. ముఖ్యంగా ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, ప్రభుత్వంపై కొనసాగుతున్న సదభిప్రాయాన్ని మరింతగా పెంచాలని కోరారు. అసెంబ్లీ ఎన్నికల్లో సాధించిన గెలుపు ఊపును స్థానిక సంస్థల్లో నిలుపుకోవాలని కాంగ్రెస్‌ నాయకులు వ్యూహాలు పన్నుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా తనకు బలమైన నెట్‌వర్క్‌ వున్నందున స్థానిక ఎన్నికల్లో విజయం తమనే వరిస్తుందని బీఆర్‌ఎస్‌ నేతలు భావిస్తుండగా, ప్రజలు బీఆర్‌ఎస్‌ను తిరస్కరించడం వల్లనే ఓటమి పాలైందని, గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పుడు గాలి తమకు అనుకూలంగా వున్నదని కాంగ్రెస అంచనా వేస్తోంది.

కమలనాధుల వ్యూహాలు

రేవంత్‌రెడ్డి స్థానిక సంస్థలకు ఎన్నికల నిర్వహణకు అడుగులు ముందుకువేస్తున్న నేపథ్యంలో కాషాయపార్టీ కూడా ముందస్తు ప్రణాళికలు రచిస్తోంది. పంచాయతీలకు కేంద్రంనుంచి నిధు లు పుష్కలంగా అందుతాయి కనుక ఏదోవిధంగా సాధ్యమైనన్ని ఎక్కువ స్థానాలను కైవసం చే సుకోవాలని బీజేపీ ప్రణాళికలు రచిస్తోంది. ఈ నేపథ్యంలో, కేంద్రమే పంచాయతీలకు అత్యధిక నిధులు సమకూరుస్తున్నందువల్ల, తాము సమర్థించే అభ్యర్థులకే ఓట్లు వేయాలని బీజేపీ నేతలు ఇప్పటికే పల్లెల్లో ప్రచారం మొదలుపెట్టారు. అంతేకాదు పంచాయతీలకు కేంద్రం కేటాయించిన నిధులను బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఇతర పథకాలకు మరలించిందని ఫలితంగా సర్పంచ్‌లు అభివృద్ధి పనులకోసం సొంత పలుకుబడితో అప్పులకోసం తిప్పలు పడాల్సివచ్చిందని కూడా పల్లెల్లో వీరు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి బిల్లులు వస్తాయన్న ధైర్యంతో ఉన్నసర్పంచ్‌లకు అవి సకాలంలో అందకపోవడంతో, రుణదాతలనుంచి ఒత్తిళ్లు తట్టుకోలేక ఎంతో మంది ఆత్మహత్యలు చేసుకున్న ఉదంతాలను కూడా వారు ఉదాహరణలుగా చూపుతున్నారు. 2019నుంచి రాష్ట్రంలో ఓటు షేరును బాగా పెంచుకుంటూ వస్తున్న బీజేపీ ఉత్సాహంలో ఉన్న ప్పటికీ స్థానిక సంస్థల విషయానికి వచ్చేసరికి పార్టీ పనితీరు ఆశాజనకంగా లేదు. ఈ నేపథ్యంలో పార్టీఒక నిర్ణయం తీసుకోనుంది. 2023 నవంబర్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపాలైన అభ్య ర్థులు, జిల్లా పరిషత్‌ సభ్యులుగా పోటీచేసేందుకు అవకాశం కల్పించనుంది. ప్రస్తుతం పార్టీ ఎనిమిది అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించిన నేపథ్యంలో వారు తమ నియోజకవర్గంలోని స్థానికసంస్థల్లో పార్టీ అభ్యర్థుల విజయానికి కృషిచేసే బాధ్యతలను అప్పగించే అవకాశముంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!