పాలమూరు క్రిష్టియన్ కాలనీకి చెందిన స్వచ్ఛంద సేవకుడు డా.నిచ్చనమెట్ల రాజేంద్రప్రసాద్ గత సంవత్సరము తన పుట్టినరోజున ఒక మంచి సంకల్పముతో వారి నాన్నగారి జ్ఞపకార్థం తెలుగు అక్షరమాల పటాలను ఉచితంగా పంపిణి చేయాలనుకున్నాడు.
పుట్టినరోజు నాడు తమ తల్లితో కలిసి ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి చేతులమీదుగా ఆవిష్కరించి, మొదటగా రెడ్ క్రాస్ లోని విద్యార్థులకు పంపిణీ చేశారు.
పాలమూరులోని అంగన్వాడీ కేంద్రాలు, ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులకు పంపిణిచేశారు.
క్రిష్టియన్ కాలనీ, రాంనగర్, భ్రహ్మణవాడి, రాజేంద్రనగర్, షాషాబ్ గుట్ట, మర్లు, బి కే రెడ్డి కాలనీ, ప్రేమ్ నగర్, ఏనుగొండ అప్పన్నపల్లి తదితర ప్రాంతం పాఠశాలలో ఉచితంగా పంపిణీ చేశానన్నారు.
వీటితో పాటు స్వచ్ఛందముగా విద్యార్థులకు ఎక్సమ్ పాడ్స్, పెన్నులు notebooks ఇవ్వడం జరిగింది.
ఆకలితో వున్నవారికి రైల్వేస్టేషన్, బస్టాండ్ వద్ద ఆహరమును అందించానన్నారు.
భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతానన్నారు.
