వరంగల్ కృష్ణ కాలనీలో టాస్క్ ఫోర్స్ దాడులు – 19 గ్యాస్ సిలిండర్లు సీజ్…

వరంగల్ కృష్ణ కాలనీలో టాస్క్ ఫోర్స్ దాడులు – 19 గ్యాస్ సిలిండర్లు సీజ్

గృహ వినియోగ ఎల్పీజీ సిలిండర్లను వాణిజ్య అవసరాలకు వినియోగం

రూ. 47,500 విలువైన సిలిండర్ల స్వాధీనం

వరంగల్, నేటిధాత్రి.

 

వరంగల్ నగరంలోని కృష్ణ కాలనీలో టాస్క్ ఫోర్స్ అధికారులు ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. గృహ వినియోగ ఎల్పీజీ సిలిండర్లను వాణిజ్య అవసరాలకు ఉపయోగిస్తున్నారన్న విశ్వసనీయ సమాచారంతో లహరి ఫుడ్ క్యాటరింగ్ యజమాని సంతోష్ కుమార్ నివాసంలో దాడులు చేపట్టారు.

ఈ తనిఖీలలో మొత్తం రూ. 47,500 విలువైన 19 డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. గృహ వినియోగ సిలిండర్లను వాణిజ్య కార్యకలాపాలకు వినియోగించడం నిబంధనలకు విరుద్ధమని అధికారులు తెలిపారు.

టాస్క్ ఫోర్స్ సిఐలు జి. బాబూలాల్, కే. సుధాకర్ నేతృత్వంలో ఈ ఆపరేషన్ నిర్వహించబడింది. ఈ ఘటనపై తదుపరి చర్యలు కొనసాగుతున్నట్లు అధికారులు వెల్లడించారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version