నియోజకవర్గ అభివృద్ధికి ప్రత్యేక చొరవ చూపాలని విజ్ఞప్తి
నర్సంపేట,నేటిధాత్రి :
వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, నర్సంపేట నియోజకవర్గం కన్వీనర్ తక్కళ్లపల్లి రవీందర్ రావు మంగళవారం వరంగల్ జిల్లా కలెక్టర్ సత్య శారదాదేవిని మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు.ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టర్ల బదిలీలలో భాగంగా వరంగల్ జిల్లాకు నూతనంగా విచ్చేసిన కలెక్టరర్ ను కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులతో కలిసిన ఆయన నర్సంపేట నియోజకవర్గ అభివృద్ధి పనులపై, ప్రభుత్వం అందిస్తున్న నిధుల వినియోగంపై, ప్రజా సంక్షేమం కోసం అధికారులు చూపవలసిన చొరవపై చర్చిస్తూ, ప్రజలకు అందించాల్సిన విధుల నిర్వహణ కోసం కోరినట్లు చెప్పారు. నియోజకవర్గ అభివృద్ధిలో నర్సంపేట నియోజకవర్గ ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి సూచనలతో అధికారులకు ప్రతి అడుగులో తోడుంటామని రాష్ట్ర ముఖ్యమంత్రి ఇస్తున్న అభివృద్ధి కార్యక్రమాల పిలుపులను విజయవంతం చేయుటకు అధికారులకు సహకరిస్తూ కలిసి ముందుకు నడుస్తామని కలెక్టర్ కు తెలిపామన్నారు. నియోజకవర్గ అభివృద్ధికి తమ వంతు తోడ్పాటును అందించాలని, ప్రజల సమస్యల దృష్ట్యా వెంటనే స్పందించాలని వరంగల్ జిల్లా కలెక్టర్ ను కోరినట్లు రవీందర్ రావు తెలిపారు.కలెక్టర్ ను కలిసిన వారిలో నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, దండెం రతన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.