పుర కమిషనర్ మురళీకృష్ణ
రామకృష్ణాపూర్, నేటిధాత్రి:
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న అభయ హస్తం లోని ఆరు గ్యారంటీ పథకాలను లబ్ధిదారులు అందరూ సద్వినియోగం చేసుకునేలా క్యాతనపల్లి మునిసిపాలిటీ కార్యాలయంలో ప్రజా పాలన సేవా కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని, సేవా కేంద్రాన్ని పుర ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని మున్సిపాలిటీ కమిషనర్ మురళీకృష్ణ ఒక ప్రకటనలో తెలియజేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మురళీకృష్ణ మాట్లాడుతూ…. మున్సిపాలిటీ పరిధిలోని ప్రతి ఒక్కరూ అభయ హస్తం గ్యారంటీల అమలులో భాగంగా దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులు ఇప్పటి వరకు ఎలాంటి లబ్ధి పొందనివారు ప్రజా పాలన రసీదు, ఆధార్ కార్డు, రేషన్ కార్డు, కరెంట్ బిల్లు, గ్యాస్ బిల్లులతో మున్సిపాలిటీ కార్యాలయంలోని ప్రజా పాలన సేవా కేంద్రంలో సంప్రదించాలని కోరారు. ప్రజా పాలన సేవ కేంద్రం ప్రతిరోజు అందుబాటులో ఉంటుందని తెలిపారు. ఈ అవకాశాన్ని పుర ప్రజలు వినియోగించుకోవాలని అన్నారు.