నేటిధాత్రి వరంగల్
వరంగల్ పోలీస్ కమీషనరేట్ సెంట్రల్ జోన్ డీసీపీగా షేక్ సలీమా బుధవారం బాధ్యతలు చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు మేరకు సెంట్రల్ జోన్ డీసీపీగా బాధ్యతలు చేపట్టిన షేక్ సలీమా 2007 సంవత్సరంలో గ్రూప్ 1 అధికారి హోదాలో డీఎస్పీగా బాధ్యతలు చేపట్టి కాగజ్ నగర్, సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఏసీపీగా పనిచేసి, అదనపు ఎస్పీగా రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పనిచేసి, ఎస్పీగా రైల్వే విభాగంలో పనిచేసారు.