గర్భ కోశ క్యాన్సర్ నివారణ వ్యాక్సినేషన్ సద్వినియోగం చేసుకోవాలి…

గర్భ కోశ క్యాన్సర్ నివారణ వ్యాక్సినేషన్ సద్వినియోగం చేసుకోవాలి

సర్పంచ్ కట్కూరి రాధిక శ్రీనివాస్

గణపురo నేటి ధాత్రి

 

గణపురం మండల కేంద్రంలోగర్భ కోశ క్యాన్సర్ నివారణ వ్యాక్సినేషన్ సద్వినియోగం చేసుకోవాలని
గణపురం మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ కట్కూరి రాధిక శ్రీనివాస్ అన్నారు. సోమవారం గణపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యాధికారిని డాక్టర్ అల్లూరి అనూష ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో వ్యాక్సినేషన్ ప్రక్రియను సర్పంచ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ రాధిక మాట్లాడుతూ 2011 ఫిబ్రవరి 01, ఫిబ్రవరి O1 2012 మధ్యకాలంలో జన్మించిన వారు మాత్రమే వ్యాక్సినేషన్ వేసుకోవడానికి అర్హులని అన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమం గణపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రతిరోజు వ్యాక్సినేషన్ మేడం జరుగుతుందన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సర్పంచ్ ఈ సందర్భంగా అన్నారు. మొదటిరోజు పది మందికి వ్యాక్సియేషన్ వేసినట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో డాక్టర్ ఎం ఎల్ హెచ్ పి సుచరిత సూపర్వైజర్ ఎస్ రాజేశ్వరి, హెల్త్ అసిస్టెంట్ మడికొండ వేణు, ఎల్టి రజిత, డీఈఓ శ్రీలత ఏఎన్ఎంలు రజిత, సుజాత స్వర్ణలత, ఆశ వర్కర్లు తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version