భారత్ వరుసగా అద్భుతాలు సాధించడం గర్వంగా ఉంది: రోహిత్ శర్మ…

భారత్ వరుసగా అద్భుతాలు సాధించడం గర్వంగా ఉంది: రోహిత్ శర్మ

ఐసీసీ టోర్నీల్లో భారత క్రికెట్ జట్టు అద్భుతాలు చేసింది. అయితే టీమిండియా స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ.. ప్రస్తుతం ఐసీసీకి బ్రాండ్ అంబాసిడర్‌గా కూడా ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఐసీసీ టోర్నీల్లో భారత ఆధిపత్యంపై రోహిత్ తాజాగా స్పందించాడు.

ఇంటర్నెట్ డెస్క్: ఐసీసీ టోర్నీల్లో భారత క్రికెట్ జట్టు అద్భుతాలు చేసింది. రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ నాయకత్వంలో టీ20 ప్రపంచ కప్‌ను వరుసగా రెండుసార్లు టీమిండియా ముద్దాడింది. మరోవైపు హర్మన్ ప్రీత్ కౌర్ సారథ్యంలో తొలిసారి మహిళా వన్డే ప్రపంచ కప్‌ను సొంతం చేసుకుంది. అయితే టీమిండియా స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ.. ప్రస్తుతం ఐసీసీకి బ్రాండ్ అంబాసిడర్‌గా కూడా ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఐసీసీ టోర్నీల్లో భారత ఆధిపత్యంపై రోహిత్ తాజాగా స్పందించాడు.
‘భారత్ వరుసగా అద్భుతాలు సాధించడం గర్వంగా ఉంది. గత కొన్నేళ్లుగా అంతర్జాతీయ క్రికెట్‌లో టీమిండియా ఆధిపత్యం కొనసాగుతోంది. త్రివర్ణ పతాకం రెపరెపలాడుతోంది. మున్ముందూ ఇదే దూకుడు కొనసాగుతుందని నమ్ముతున్నా. పురుషుల జట్టు వరుసగా రెండు టీ20 ప్రపంచ కప్‌లను నెగ్గింది. అయితే మహిళా జట్టుకు ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నా. తొలిసారి వన్డే ప్రపంచ కప్‌ను గెలుచుకుని చరిత్ర సృష్టించింది. ముంబై వేదికగా జరిగిన ఫైనల్ మ్యాచ్‌ను చూడటం చాలా బాగుంది. అయితే ఇది ఆరంభం మాత్రమే. ఒక్కసారి ఇలాంటి స్థితికి చేరుకున్న తర్వాత ముందుకు సాగిపోవాల్సిందే. అందరిపై బాధ్యత ఇంకా పెరుగుతుంది’ అని రోహిత్ శర్మ వివరించాడు.

సవాళ్లను స్వీకరించాలి..

‘ఎప్పుడు అవకాశం వచ్చినా అందుకోవడానికి రెడీగా ఉండాలి. ప్రతి సవాల్‌ను స్వీకరించాలి. అందుకోసం సన్నద్ధతే కీలకం. జాతీయ జట్టుకు ఎవరినైనా ఎంచుకున్నారంటే దానికి కారణం ఉంటుంది. మన దేశంలో చాలా పోటీ ఉంది. కాబట్టి అండర్ 14 నుంచే కష్టపడుతూ రావాలి. ఎంత టాలెంట్ ఉన్నా కొన్నిసార్లు అదృష్టం కూడా కలిసి రావాలి. సరైన సమయంలో మనలోని ఆటగాడిని గుర్తించే వ్యక్తి తారసపడాలి. మీ దగ్గర మంచి నైపుణ్యం ఉన్నా సరే ఎవరికీ చూసే అవకాశం రాకపోతే వృథానే. అలా అని అదృష్టం కోసమే ఎదురుచూస్తూ ఉండకూడదు.. నిరంతరం శ్రమిస్తూ ఉండాలి’ అని రోహిత్ శర్మ వెల్లడించాడు.

జగన్ దంపతులను విచారించాల్సిన అవసరం ఉంది: వైఎస్ సునీత…

జగన్ దంపతులను విచారించాల్సిన అవసరం ఉంది: వైఎస్ సునీత

 

తన తండ్రి హత్య కేసులో దర్యాప్తు సంస్థ సీబీఐ బాధ్యతగా విచారణ జరపడం లేదని వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె వైఎస్ సునీత ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం కడపలో వైఎస్ సునీత విలేకర్లతో మాట్లాడుతూ.. ఈ హత్య కేసులో కీలక నిందితులు చెప్పిందే వినడం తప్ప.. వారిని లోతుగా సీబీఐ విచారించ లేదన్నారు.

కడప, మార్చి 15: తన తండ్రి హత్య కేసులో దర్యాప్తు సంస్థ సీబీఐ బాధ్యతగా విచారణ జరపడం లేదని వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె వైఎస్ సునీత ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం కడపలో వైఎస్ సునీత విలేకర్లతో మాట్లాడుతూ.. ఈ హత్య కేసులో కీలక నిందితులు చెప్పింది వినడమే తప్ప.. వారిని లోతుగా సీబీఐ విచారించలేదన్నారు. నిందితుల మధ్య జరిగిన ఫోన్‌ సంభాషణ గురించి సీబీఐ సీరియస్‌గా తీసుకొని విచారించడం లేదని ఆమె పెదవి విరిచారు. తన తండ్రి హత్య జరిగిన తరువాత నిందితులందరి మధ్య ఫోన్‌ సంభాషణలు, మేసేజ్‌లు అత్యధికంగా జరిగాయని ఆమె గుర్తు చేశారు.
ఇంకా ఏమైనా ఇతర ఆధారాలు ఉంటే ఇవ్వండని అడిగితే.. తన వద్దనున్న అదనపు ఆధారాలను సైతం కోర్టుతో పాటు సీబీఐకి సమర్పించానని చెప్పారు. వాటిపై సైతం లోతుగా విచారణ జరపలేదన్నారు. ఈ హత్య కేసులో వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌తోపాటు ఆయన భార్య వైఎస్ భారతిని సైతం విచారించాల్సి అవసరం ఉందని కుండబద్దలు కొట్టారు. కాని వారిని సీబీఐ విచారించలేదన్నారు. ఈ స్థాయిలో పోరాడుతున్నా తనకు చివరకు న్యాయం జరగలేదని చెప్పారు. మన దేశంలో వ్యవస్థలన్నీ ఇలానే ఉన్నాయని పేర్కొన్నారు. చాలా బాధగా ఉందని.. తన పోరాటం ఇంతటితో ఆగదని తెలిపారు. ఈ పోరాటం చివరి వరకు కొనసాగిస్తానంటూ వైఎస్ సునీత స్పష్టం చేశారు.
Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version