దివంగత మాజీ ఎమ్మెల్యే జయ రాములు ఇంటి ఎదురుగా పురాతన కాలువ జాము
మున్సిపల్ చైర్మన్ వార్డులో ఇది పరిస్థితి
వనపర్తి నేటిదాత్రి
వనపర్తి జిల్లా కేంద్రంలో దివంగత మాజీ ఎమ్మెల్యే జయ రాములు ఇంటి దగ్గర కాలువ జాము పందికొక్కులు తొగడము తో మురికి నీరు పోవడము లేదని దోమలు ఈగలు ఇండ్లలో కి వస్తున్నాయని ప్రజలు ఆవేదన వ్యక్తంచేశారు 50 సంవత్సరాల క్రితం కాలువ నిర్మాణం చేశారని తెలంగాణ జన సమితి జిల్లా అధ్యక్షులు ఎం ఏ ఖాదర్ పాషా ఆవేదన వ్యక్తం చేశారు
ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ గతములో కాలువ నిర్మాణం గురించి 33 వ వార్డు ప్రజలు మున్సిపల్ మున్సిపల్ కమిషనర్ కు ప్రజాప్రతినిధికి తెలిపిన పట్టించుకోలేదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు మున్సిపల్ నల్ల పవర్ బోర్ వృధాగా ఉన్నదని బోరు లో నీళ్లు ఉన్నాయని హ్యాండ్ పంపు బిగిస్తే ప్రజలకు నీళ్లు త్రాగడానికి ఉపయోగాల్లోకి వస్తాయని ఆయన పేర్కొన్నారు 33 వ వార్డు సీనియర్ జర్నలిస్ట్ పోలిశెట్టి బాలకృష్ణ ఇంటి లో కి వార్డు ప్రజల ఇళ్లలోకి పందికొక్కులు విష సర్పాలు ఎలుకలు ఇండల్లోకి వచ్చి భయభ్రాంతులకు గురి చేస్తున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు మున్సిపల్ చైర్మన్ వార్డు ఈ పరిస్థితి ఉంటే వనపర్తి లోమిగతా వార్డుల పరిస్థితి ఏవిధంగా ఉంటుందని ఆయన ప్రశ్నించారు కాలువ గురించి మున్సిపల్ కమిషనర్ కు మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడంలేదని మున్సిపల్ కమిషనర్ పై అధికారులపై రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయం ప్రజా భవన్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ప్రజావాణి వనపర్తి ఎమ్మెల్యే తూడి మెగా రెడ్డి ప్లానింగ్ బోర్డ్ మున్సిపల్ చైర్మన్ మిడిదొడ్డి మాధవికి ఫిర్యాదు చేస్తామని ఆయన పేర్కొన్నారు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 99 రోజుల ప్రజా ప్రణాళిక కార్యక్రమానికి మున్సిపల్
అధికారులు తూట్లు పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు వెంటనే మున్సిపల్ చైర్మన్ మిడిదొడ్డి మాధవి మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు సానిటరీ ఇన్స్పెక్టర్ ఉమామహేశ్వర్ రెడ్డి వనపర్తి లో అన్ని వార్డులను తనిఖీ చేసి మురికి కాలువ జాములను చెత్తను మురికి కాలువలపై రేకుల షెడ్లు వేసుకున్నారని 33 వ వార్డులో సిసి రోడ్డును కబ్జా చేసి రోడ్డును హైట్ గా నిర్మించి కబ్జా చేసి రేకుల షెడ్ లు నిర్మించుకున్నారని వాటిని తొలగించాలని ఆయన కోరారు ఏది ఏమైనా చట్టంలో అందరు సమానులేనని రోడ్లను మురికి కాల్వలను షెడ్లను నిర్మించి కార్లు పార్కింగ్ చేసుకోవడానికి అద్దెలకు ఇచ్చుకున్నారని అట్టి వాటిని తొలగించి ప్రజలకు న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు వనపర్తి మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకోకుంటే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లోకాయుక్త హైదరాబాద్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ కు ఫిర్యాదు చేస్తామని ఖాదర్ చెప్పారు ఈ కార్యక్రమంలో వార్డు ప్రజలు రామ్మోహన్ శ్రీనివాసులు జ్ఞానేశ్వర్ తదితరులు పాల్గొన్నారు ఈ కాలువను బియ్యం వ్యాపారి దొంత నందు ఇంటి ముందర కలపాలని ఆయన కోరారు
