పైడి గుమ్మల్ లో ముస్లిం సోదరుల ఇఫ్తార్ విందులో సర్పంచ్ శ్రీకాంత్…

పైడి గుమ్మల్ లో ముస్లిం సోదరుల ఇఫ్తార్ విందులో సర్పంచ్ శ్రీకాంత్

జహీరాబాద్ నేటి ధాత్రి:

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గం కోహీర్ మండలం పైడి గుమ్మల్ గ్రామంలో ఆదివారం ముస్లిం సోదరులు ఇఫ్తార్ విందును నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ కొత్తూర్ శ్రీకాంత్, మాజీ ఎంపిటిసి బి. జ్ఞానరత్నం, వార్డు సభ్యులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. భారతదేశంలో భిన్నత్వంలో ఏకత్వం ఉందని, అందరూ ఒకటేనని గ్రామస్తులు ఇఫ్తార్ విందులో పాల్గొని ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో యువకులు, వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version