కొత్త హైవే పనుల్లో స్వల్ప అంతరాయం
పరకాల,నేటిధాత్రి
మల్లక్కపేట గ్రామ సమీపంలో బోర్లపడ్డ మొరం వాహనం పరకాల పరిధిలో కొత్తగా కొనసాగుతున్న నేషనల్ హైవే నిర్మాణ పనుల మధ్య మల్లక్కపేట గ్రామ సమీపంలో ఒక స్వల్ప ఘటన చోటుచేసుకుంది. మొరం (మట్టి) లోడుతో వెళ్తున్న ఒక వాహనం అదుపు తప్పి రోడ్డుపై బోర్లపడింది.ఈ ఘటనతో అక్కడ జరుగుతున్న హైవే పనులకు తాత్కాలికంగా అంతరాయం ఏర్పడింది.వాహనం బోర్లపడటంతో రోడ్డుపై కొంత మొరం చెల్లాచెదురుగా పడిపోవడంతో వాహనాల రాకపోకలు కొద్దిసేపు మందగించాయి.అయితే ఎటువంటి ప్రాణనష్టం లేదా గాయాలు జరగలేదు.పరిస్థితి త్వరలోనే సాధారణ స్థితికి చేరుకుని, వాహనాల రాకపోకలు సజావుగా కొనసాగాయి.హైవే నిర్మాణ పనులు జరుగుతున్న ప్రాంతాల్లో డ్రైవర్లు అప్రమత్తంగా ఉండాలని స్థానికులు సూచిస్తున్నారు.
