అమలులోకి వాహన రిజిస్ట్రేషన్ నూతన విధానం
జిల్లా రవాణా అధికారి గోపికృష్ణ
మంచిర్యాల,నేటి ధాత్రి:
ప్రభుత్వ ఆదేశానుసారం వాహన రిజిస్ట్రేషన్ లో నూతన విధానాన్ని అమలు చేయడం జరుగుతుందని జిల్లా రవాణా అధికారి గోపికృష్ణ ఒక ప్రకటనలో తెలిపారు. నూతన మోటార్ సైకిళ్ళు,లైట్ మోటార్ వాహనాల రిజిస్ట్రేషన్ వాహనం కొనుగోలు చేసిన డీలర్ పాయింట్ వద్ద జరిగేలా వాహనదారుల సౌలభ్యం కొరకు సాఫ్ట్ వేర్ రూపొందించి అమలు చేయడం జరుగుతుందని తెలిపారు.ఈ విషయమై మోటార్ సైకిళ్ళు, లైట్ మోటార్ వాహనాల డీలర్లతో సమావేశం నిర్వహించి నూతన విధానంపై వివరించడంతో పాటు విధి విధానాలపై అవగాహన కల్పించడం జరిగిందని తెలిపారు.
