నీళ్లలో పడిపోయిన ఏనుగు పిల్ల.. చివరకు పెద్ద ఏనుగులు చేసిన పని చూస్తే..
ఓ ఏనుగు పిల్ల నీళ్లు తాగే క్రమంలో ప్రమాదవశాత్తు అందులో పడిపోయింది. బయటికి రాలేక గిలగిలా కొట్టుకుంటూ ఉంది. ఇంతలో దూరం నుంచి గమనించిన పెద్ద ఏనుగులు.. పరుగు పరుగున అక్కడికి చేరుకున్నాయి..
ఏనుగులు చూసేందుకు ఎంత భారీగా కనిపిస్తుంటాయో.. అంతే స్థాయిలో బీభత్సం సృష్టిస్తుంటాయి. అలాగే కొన్నిసార్లు అంతే ఆశ్చర్యపరుస్తుంటాయి. ఇంకొన్నిసార్లు అవి చేసే పనులు చూస్తే.. గుండెలను హత్తుకునేలా ఉంటాయి. ఇందుకు నిదర్శనంగా మన కళ్ల ముందు అనేక సంఘటనలు చోటు చేసుకుంటుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ ఏనుగు పిల్ల నీళ్లలో పడిపోయింది. ఇది గమనించిన పెద్ద ఏనుగులు చివరకు ఏం చేశాయో మీరే చూడండి..
