అమ్మాయిలు, అబ్బాయిల మధ్య తేడా చూశారా.. వీడియో చూస్తే ఫుల్ క్లారిటీ..

అమ్మాయిలు, అబ్బాయిల మధ్య తేడా చూశారా.. వీడియో చూస్తే ఫుల్ క్లారిటీ..

 

తాజాగా అమ్మాయిలకు, అబ్బాయిలకు తేడా తెలిపేలా రూపొందించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియో చాలా మందిని ఆకట్టుకుంటోంది.

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రతిరోజు కొన్ని వందల వీడియోలు మన కళ్ల ముందుకు వస్తున్నాయి. వాటిల్లో కొన్ని ఆసక్తికరంగా, మరికొన్ని ఫన్నీగా ఉంటూ అందర్నీ ఆకట్టుకుంటున్నాయి. తాజాగా అమ్మాయిలకు, అబ్బాయిలకు తేడా తెలిపేలా రూపొందించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది
అనే ఎక్స్ యూజర్ ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. అబ్బాయిలు, అమ్మాయిలు తమ స్కూల్ బయట వైర్వేరు లైన్లలో నిలబడి ఉన్నారు. ఆ సమయంలో వర్షం పడుతోంది. దీంతో వారందరూ గొడుగులు వేసుకుని నిలబడ్డారు. అమ్మాయిలు ఒక వైపు, అబ్బాయిలు మరోవైపు ఉన్నారు. అయితే అమ్మాయిలు నిలబడి ఉన్న వైపు రకరకాల రంగుల్లో ఉన్న గొడుగులు అందంగా కనిపిస్తున్నాయి (funny viral content).
అబ్బాయిలు నిల్చున్న వైపు ఉన్న గొడుగులన్నీ ఒకే తరహాలో నలుపు రంగులో ఉన్నాయి (boys girls reactions). ఈ వీడియో అబ్బాయిలు, అమ్మాయిల మధ్య వ్యత్యాసాన్ని చూపిస్తోందని వీడియో పోస్ట్ చేసిన వ్యక్తి కామెంట్ చేశారు. అమ్మాయిలు ఎల్లప్పుడూ అందమైన వస్తువులను ఎంచుకుంటారనే విషయం స్పష్టంగా తెలుస్తోందని పేర్కొన్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వైరల్ వీడియోను ఇప్పటివరకు 1.6 లక్షల కంటే ఎక్కువ మంది వీక్షించారు. వేల మంది ఆ వీడియోను లైక్ చేసి తమ స్పందనలను తెలియజేశారు.
Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version