అమ్మాయిలూ ఈ అలెర్ట్ మీకోసమే.. ప్రయాణంలో ఈ జాగ్రత్తలు తప్పనిసరి..
అమ్మాయిలు స్నేహితులతో ట్రిప్‌కు వెళ్లడం చాలా సరదాగా ఉంటుంది. కానీ ఆనందంతో పాటు భద్రత కూడా ముఖ్యం. కాబట్టి ప్రయాణంలో ఈ జాగ్రత్తలు తీసుకోవడం మంచిది..
స్నేహితులతో కలిసి గడిపే ప్రయాణ క్షణాలు జీవితాంతం గుర్తుండిపోయే జ్ఞాపకాలుగా మిగులుతాయి. రోజువారీ జీవితంలో అందరూ తమ పనులతో బిజీగా ఉంటారు కాబట్టి.. ఈ ట్రిప్స్ మరింత విలువైనవిగా మారుతాయి. అయితే, నేటికీ చాలా కుటుంబాల్లో.. అమ్మాయిలు ఒంటరిగా ప్రయాణించడంపై భయపడుతుంటారు. అందుకే అమ్మాయిలు ట్రిప్‌కు వెళ్లేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం.
బస చేసే చోట జాగ్రత్త..
హోటల్లో బట్టలు మార్చుకునేటప్పుడు, స్నానం చేసేటప్పుడు అప్రమత్తంగా ఉండండి. కొన్నిచోట్ల సీక్రెట్ కెమెరాలు ఉండే అవకాశముంటుంది. మీ ఫోన్ ఫ్లాష్‌లైట్‌తో గది మొత్తం ఒకసారి చూసుకోండి. వీలైతే బట్టలు మార్చుకునేటప్పుడు లైట్స్ ఆఫ్ చేయడం మంచిది.
