ప్రాణం తీసిన చేప.. యువకుడు నోటిలో పెట్టుకోగానే..

ప్రాణం తీసిన చేప.. యువకుడు నోటిలో పెట్టుకోగానే..

 

చేప కారణంగా ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. చేప గొంతులోకి వెళ్లి ఇరుక్కోవటంతో ఊపిరి ఆడక యువకుడు చనిపోయాడు. ఈ సంఘటన ఒడిశాలో శుక్రవారం చోటుచేసుకుంది.

భువనేశ్వర్, ఏప్రిల్ 5: చేప కారణంగా ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ సంఘటన ఒడిశాలో శుక్రవారం చోటుచేసుకుంది. ఆ వివరాల్లోకి వెళితే.. మయుర్‌భంజ్ జిల్లాలోని దిగి గ్రామానికి చెందిన అభినాశ్ బిజులీ శుక్రవారం చేపలు పట్టడానికి ఊరి బయట ఉన్న చెరువు దగ్గరకు వెళ్లాడు. ఈ నేపథ్యంలోనే అతడికి ఇండియన్ కోయ్ జాతికి చెందిన చేప చిక్కింది. చేప తప్పించుకోకుండా ఉండటానికి దాన్ని నోట్లో పెట్టుకున్నాడు. అయితే, ఆ చేప గొంతులోకి దూరింది. దీంతో అభినాశ్ ఊపిరి తీసుకోవటంలో తీవ్ర ఆటంకం ఏర్పడింది.

 

మోడల్‌కాలనీగా సాగర్‌నగర్‌ అభివృద్ధి

సొమ్ము కొట్టు.. ఎఫ్‌సీ పట్టు!

19 మంది సివిల్‌ జడ్జీలకు సంస్థాగత శిక్షణ పూర్తి

శ్రీశైలంలో మిగిలింది 43 టీఎంసీలే

ఏఐ అవకాశాలను యువత అందిపుచ్చుకోవాలి

‘యుద్ధం’తో పెరిగిన నిర్మాణ వ్యయం: క్రెడాయ్‌

స్త్రీ శక్తికి దన్నుగా పది సూత్రాలు: సత్యకుమార్‌

మహిళల జోలికొస్తే క్షమించం: రాయపాటి శైలజ

జిహాదీ గురించి తెలుసుకుంటున్నాం

ఎదురుదెబ్బలకు అధైర్యపడొద్దు!

పేదల ఇళ్లపై వైసీపీ గద్దలు

విదేశీ ప్రయాణం చేసిన అర్చకులు..గర్భాలయంలోకి ప్రవేశించడానికి 

ఆ ఉద్యోగులను క్రమబద్ధీకరించాల్సిందే!

మోడల్‌కాలనీగా సాగర్‌నగర్‌ అభివృద్ధి

సొమ్ము కొట్టు.. ఎఫ్‌సీ పట్టు!

19 మంది సివిల్‌ జడ్జీలకు సంస్థాగత శిక్షణ పూర్తి

శ్రీశైలంలో మిగిలింది 43 టీఎంసీలే

ఏఐ అవకాశాలను యువత అందిపుచ్చుకోవాలి

‘యుద్ధం’తో పెరిగిన నిర్మాణ వ్యయం: క్రెడాయ్‌

స్త్రీ శక్తికి దన్నుగా పది సూత్రాలు: సత్యకుమార్‌

మహిళల జోలికొస్తే క్షమించం: రాయపాటి శైలజ

జిహాదీ గురించి తెలుసుకుంటున్నాం

ఎదురుదెబ్బలకు అధైర్యపడొద్దు!

పేదల ఇళ్లపై వైసీపీ గద్దలు

విదేశీ ప్రయాణం చేసిన అర్చకులు..గర్భాలయంలోకి ప్రవేశించడానికి 

ఆ ఉద్యోగులను క్రమబద్ధీకరించాల్సిందే!

అతడు ఎంత ప్రయత్నించినా చేప బయటకు రాలేదు. ఊపిరి తీసుకోవటానికి విశ్వ ప్రయత్నాలు చేశాడు. అయినా అతడి వల్ల కాలేదు. కుటుంబసభ్యులు అతడిని ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అభినాశ్ ప్రాణాలు కోల్పోయాడు. ఈ సంఘటనపై అభినాశ్ మేనమామ మాట్లాడుతూ.. ‘కావ్ చేప ప్రమాదవశాత్తు మా అల్లుడి గొంతులో ఇరుక్కుపోయింది. అతడిని మేము బంగిరిపోసి మెడికల్ ఆస్పత్రికి తీసుకెళ్లాము. అక్కడి డాక్టర్ మాతో ఎంతో దురుసుగా ప్రవర్తించాడు. అభినాశ్‌కు వైద్యం చేయకుండానే వేరే ఆస్పత్రికి తీసుకెళ్లమన్నాడు’ అని చెప్పుకొచ్చాడు.
Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version