ప్రజల ఆరోగ్య సంరక్షణ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం…

ప్రజల ఆరోగ్య సంరక్షణ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం

ఎమ్మెల్యే గండ్రసత్యనారా యణరావు

శాయంపేట నేటిధాత్రి:

శాయంపేట మండల కేంద్రం లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో స్పెషలిస్ట్ వైద్యులు ఆర్ బిఎస్ కే వైద్య బృందం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని ఎమ్మెల్యే గండ్ర సత్యనారా యణరావు ప్రారంభించారు ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజల ఆరోగ్య సంరక్షణ ప్రభుత్వం ప్రధాన లక్ష్యమని తెలిపారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని పేర్కొన్నారు. ఇలాంటి వైద్య శిబిరాల ద్వా రా ప్రజలు ఆరోగ్య పరీక్షలు చేయించుకొని అవసరమైన చికిత్స పొందాలని ఆయన సూచించారు. ఈ కార్యక్ర మంలో హన్మకొండ డీ.ఎమ్. ఎచ్.ఓ డా. అప్పయ్య , మండల మెడికల్ ఆఫీసర్, మండల ప్రజాప్రతినిధులు, మండల కాంగ్రెస్ పార్టీ అధ్య క్షుడు దూదిపాల బుచ్చి రెడ్డి, అన్ని గ్రామాల కాంగ్రెస్ కార్య కర్తలు అభిమానులు ,ప్రజలు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version