ప్రగతి ప్రణాళిక సమర్థవంతంగా అమలు చేయాలి
ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక సమీక్షలో ఆర్డీఓ ఉమారాణి
నర్సంపేట,నేటిధాత్రి:
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమం గ్రామాల్లో సమర్థవంతంగా అమలు చేయాలని ఆర్డీఓ ఉమారాణి అన్నారు.ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా చేపట్టిన 99 రోజుల కార్యక్రమంపై నర్సంపేట మండల కేంద్రంలోని రైతు వేదికలో సమీక్ష సమావేశం ఎంపీడీవో శ్రీనివాస్ రావు అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా రెవెన్యూ డివిజనల్ అధికారి ఉమారాణి హాజరయ్యారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ఫలాలు ప్రజలకు చేరేలా అన్ని శాఖల సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. ఈ ప్రణాళికను మరింత సమర్థవంతంగా అమలు చేసి ప్రజల్లో అవగాహన పెంపొందించాలని అధికారులకు సూచించారు.మండల ప్రజా పరిషత్ ప్రత్యేక అధికారి భాగ్యలక్ష్మి, మండల తహసీల్దార్, మండల విద్యాధికారి సారయ్య, పోలీసు అధికారులు, వివిధ శాఖల అధికారులు సమావేశంలో పాల్గొని వారి వారి అభిప్రాయాలను వ్యక్తం చేశారు.అనంతరం సమగ్ర శిశు అభివృద్ధి సేవల పథకం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆహార ప్రదర్శన శాలను రెవెన్యూ డివిజనల్ అధికారి ఉమారాణి మరియు ఇతర అధికారులు సందర్శించారు.ఈ కార్యక్రమంలో రెవెన్యూ డివిజనల్ అధికారి ఉమారాణి, మండల ప్రజా పరిషత్ ప్రత్యేక అధికారి భాగ్యలక్ష్మి, మండల తహసీల్దార్, మండల విద్యాధికారి సారయ్య, పోలీసు అధికారులు, వివిధ శాఖల అధికారులు, సర్పంచులు, సమగ్ర శిశు అభివృద్ధి సేవల పథకం పర్యవేక్షకులు పారిజాతం, అరుణ, నర్సంపేట మండల అంగన్‌వాడీ ఉపాధ్యాయులు, అలాగే అన్ని శాఖల ఉద్యోగులు పాల్గొన్నారు.
