చిన్న వయసులో ప్రెగ్నెన్సీ – శిశు మరణాలకు ప్రమాదం

చిన్న వయసులో ప్రెగ్నెన్సీ – శిశు మరణాలకు ప్రమాదం

* చేవెళ్ల అంగన్వాడి 3వ సెంటరులో చైల్డ్ సేఫ్టీ వీక్ కార్యక్రమం

* యువతలో అవగాహన కొరతే టీనేజ్ ప్రెగ్నెన్సీలకు కారణం

* 18 వ వార్డు కౌన్సిలర్ మంగలి లావణ్య యాదగిరి

నేటిధాత్రి, చేవెళ్ల :

 

చదువుల వైపు వెళ్లాల్సిన యువత 13 ఏళ్ల నుండి 19 సంవత్సరాల మధ్య వయసులోనే గర్భం దాల్చడం భవిష్యత్తులో సమాజానికి విఘాతంగా మారే అవకాశం ఉందని చేవెళ్ల మున్సిపాలిటీ 18 వ వార్డు కౌన్సిలర్ మంగలి లావణ్య యాదగిరి అన్నారు. మంగళవారం చేవెళ్ల మున్సిపల్ పట్టణ కేంద్రంలోని అంగన్వాడి 3వ సెంటర్లో అంగన్వాడి టీచర్ అఫియా నూర్జహాన్ ఆధ్వర్యంలో చైల్డ్ సేఫ్టీ వీక్ కార్యక్రమంలో భాగంగా టీనేజ్ లో గర్భధారణ, ఎలోప్మెంట్ పై అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా 18వ వార్డు కౌన్సిలర్ కళ్యాణి హాజరై మాట్లాడుతూ చిన్నతనంలో గర్భం దాల్చడంతో ఆ చిన్నారుల జీవితం బాధ్యతల మధ్య బందీ అవుతుందన్నారు. ఈ ప్రభావం కుటుంబ ఎదుగుదలతో పాటు, సమాజంలో దేశసంస్కృతి సాంప్రదాయాలపై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుందన్నారు. తల్లిదండ్రులు చదువుకోకపోవడం వల్ల పిల్లలకు సరైన అవగాహన లేకపోవడం, సోషల్ మీడియా ద్వారా ఆకర్షణకు గురవడం, గ్రామీణ ప్రాంతాల్లో అవగాహన కొరత లాంటివి టీనేజ్ ప్రెగ్నెన్సీలకు ప్రధాన కారణం అన్నారు. టీనేజ్ ప్రెగ్నెన్సీలను నివారించడానికి స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాలు నిర్వహించడం, పిల్లలకు ఆరోగ్య అవగాహన, తల్లిదండ్రులకు సలహాలు అవగాహన కల్పిస్తూ గ్రామీణ ప్రాంతాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఈ పరిస్థితికి చెక్‌ పెట్టవచ్చు అన్నారు.

* చిన్న వయసులో ప్రెగ్నెన్సీ – శిశు మరణాలకు ప్రమాదం

అంగన్వాడీ టీచర్ అఫియా నూర్జహాన్ మాట్లాడుతూ
చిన్న వయసులోనే ప్రెగ్నెన్సీ వస్తే మాత, శిశు మరణాల ప్రమాదం కూడా పెరిగే అవకాశం ఉందని అన్నారు. ఈ పరిస్థితి అన్ని రంగాలపైన ప్రభావాన్ని చూపిస్తుందన్నారు. చిన్న వయసులోనే ప్రెగ్నెన్సీకి బాల్యవివాహాలు చేయడం, తెలిసి తెలియని వయసులో చేసే పొరపాట్లు, అత్యాచారాలు వంటి సంఘటనలే ప్రధాన కారణంఅన్నారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ కార్యాలయ బిల్ కలెక్టర్ రాఘవేందర్, ఆర్. పి. స్వరూప, ఆశావర్కర్లు కిషోర,విజయలక్ష్మి, బాలికల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version