విద్యా సదస్సును విజయవంతం చేయండి
TPTFజమ్మికుంట అధ్యక్షులు కొండపాక తిరుపతి
జమ్మికుంట (నేటిధాత్రి )
టిపిటిఎఫ్ (TPTF) తెలంగాణ ప్రోగ్రెస్ టీచర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న రాష్ట్ర విద్యా సదస్సును విజయవంతం చేయాలని జమ్మికుంట TPTF అధ్యక్షులు శ్రీ తిరుపతి గారు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా జమ్మికుంట మండల కేద్రములో కరపత్రాలు, పోస్టర్లను విడుదల చేశారు.
ఈ సదస్సు 2026 ఏప్రిల్ 30న హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించబడనుంది. ఈ కార్యక్రమానికి ఉపాధ్యాయులు, విద్యార్థులు, విద్యాభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు.
“సమరశీలతత్వాన్ని చాటుకుందాం – విద్యా సమానత్వం సాధిద్దాం” అనే నినాదంతో ఈ సదస్సు జరుగుతుందని తెలిపారు. విద్యారంగ సమస్యలతో పాటు సామాజిక సమస్యల పరిష్కారం కోసం ఉపాధ్యాయులు నిరంతరం పోరాటాలు చేస్తున్నారని పేర్కొన్నారు.
ప్రతి ఒక్కరికీ నాణ్యమైన, ఉచిత, సమాన విద్య అందించడం ప్రభుత్వ బాధ్యత అని, “కామన్ స్కూల్ విధానం” అమలు చేయాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు. విద్యా హక్కుల సాధన కోసం సమగ్ర ఉద్యమాన్ని నిర్మించడమే టిపిటిఎఫ్ లక్ష్యమని తెలిపారు.
ఈ రాష్ట్ర విద్యా సదస్సుకు ముఖ్య అతిథిగా డాక్టర్ కె. నవీన్ నికోల ఐఏఎస్ హాజరుకానున్నారు. గౌరవ అతిథిగా ప్రొఫెసర్ కోదండరాం పాల్గొననున్నారు. జాతీయ విద్యా విధానం, సామాజిక న్యాయం పై ప్రొఫెసర్ హరగోపాల్, తెలంగాణలో విద్యా అసమానతలపై ప్రొఫెసర్ కాసిం, అంతర్జాతీయ రాజకీయాలపై శ్రీనివాస్ తదితరులు ప్రసంగించనున్నారు.
ఈ పోస్టర్ విడుదల కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి కొండపాక తిరుపతి జిల్లా ఉపాధ్యక్షులు మర్రి అవినాష్ జమ్మికుంట మండల జనరల్ సెక్రటరీ పాక కుమారస్వామి,ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులు తదితరలు పాల్గొన్నారు.
