వేసవి సెలవులను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి

వేసవి సెలవులను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి

డాన్స్ మాస్టర్ రాపర్తి పవన్

భూపాలపల్లి నేటిధాత్రి

పాఠశాల విద్యార్థులు వేసవి సెలవులను సద్వినియోగం చేసుకోవాలని శ్రీ గణేష్ తారా డాన్స్ అకాడమీ మాస్టర్ రాపర్తి పవన్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ విద్యార్థులు వేసవి సెలవులను వృధా చేయకుండా, మొబైల్ ఫోన్ లకు పరిమితం కాకుండా ఆసక్తి గల కళలు నేర్చుకొని సెలవులను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. అందులో భాగముగా తమ అకాడమీ ఆధ్వర్యంలో ఈనెల 22వ తేదీ నుండి 60 రోజుల మెగా సమ్మర్ డాన్స్ తరగతులు ప్రారంభించనున్నట్లు తెలిపారు. అందరికి అందుబాటులో ఉండే ఫీజుతో తరగతుల నిర్వహణ ఉంటుందని ఆసక్తి గల విద్యార్థులు 8978789842 సెల్ నెంబర్ లో సంప్రదించవచ్చని ఈ సందర్బంగా పవన్ తెలిపారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version