విధి కుక్కలకు వింత రోగాలు…
వ్యాధుల బారిన పడుతున్న విధి కుక్కలు…
వింత వ్యాధులతో గ్రామాల్లో సంచరిస్తున్న వైనం…
చర్మ వ్యాధుల బారిన పడుతున్న విధి కుక్కలు, ప్రజలకు సోకుతుందేమోననే ఆందోళలో ప్రజలు…
నేటిధాత్రి – గార్ల :
మహబూబాబాద్ జిల్లా, గార్ల, బయ్యారం మండలాల్లోని చిన్నకిష్టపురం గ్రామపంచాయతీ పరిధిలోని చిన్నకిష్టపురం, దేశ్య తండ, మంగలి తండ, ఎస్టి కాలనీ, సర్వన్ తండ గ్రామాలతో పాటు, బయ్యారం మండలం కొత్తపేట గ్రామాల్లో విధి కుక్కలకు ఫంగస్ వచ్చి,వింత రోగాలు,చర్మ వ్యాధులతో యదేచ్చగా తిరుగుతున్నాయి. వింత రోగాలతో కుక్కల ఒంటి పై బొచ్చు ఊడిపోయి చర్మ వ్యాధులతో, నోట్లో నుండి నురగలు తీస్తూ సంచరిస్తుంటే, ఇది గమనించిన ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు.చర్మం తోలు ఊడిపోయి బక్క చిక్కి, నిరసించి, గ్రామాల్లో దర్శనమివ్వడంతో విధి కుక్కలకు ఏదో వైరస్ సోకిందని, ఇది ఏ మహమ్మారో నని,ఇది ప్రజలకు సోకుతుందేమోనని, భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.ఇదిలావుంటే త్వరలోనే పాఠశాలలు ప్రారంభం కానున్న నేపథ్యంలో పాఠశాలలకు వెళ్లే పిల్లలపై రెచ్చిపోతు, వెంబడించి గాయపరిచే ప్రమాదం పొంచి ఉంది.ఇంత జరుగుతున్న ప్రభుత్వం కానీ, ప్రభుత్వ అధికారులు పట్టించుకోకపోవడం విచారకరం.తక్షణమే ఉన్నత అధికారులు చొరవ తీసుకోని వింత వ్యాధులతో బాధపడుతున్న వీధి కుక్కల బారి నుండి ప్రజలను కాపాడాలని,విధి కుక్కల నియంత్రణ చర్యలు చేపట్టాలని అధికారులను ప్రజలు,ప్రజా సంఘాలు కోరుతున్నారు.