ఉత్సాహంగా పోలీస్ ప్రెస్ ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్
శాయంపేట నేటిధాత్రి:
శాయంపేట పోలీస్ స్టేషన్ సిబ్బంది ప్రెస్ మిత్రుల జట్ల మధ్య సోమవారం పత్తిపాక శివారు మైదానంలో జరిగిన స్నేహపూర్వక క్రికెట్ మ్యాచ్ పోలీస్ జట్టు విజయం సాధిం చింది ఏసిపి, సీఐ,ఎస్ఐ లు బ్యాటింగ్ తో అలరించారు. అనంతరం గెలుపొందిన జట్టుకు బహుమతి అంద జేశారు అనంతరం ఏసీపి మాట్లాడుతూ నిత్యం పని ఒత్తిడిలో ఉండే పోలీసులు జర్నలిస్టుల మధ్య ఫ్రెండ్లీ మ్యాచ్ జరగడం శుభ పరిణా మమని మ్యాచ్ క్రీడా స్ఫూర్తితో ఉత్కంఠ భరితంగా సాగింద న్నారు.
అనంతరం విజేత జట్టుకు మరియు రన్నర్ జట్టుకు బహుమతులు అందించి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పరకాల ఏసీపీ సతీష్ బాబు, శాయంపేట సీఐ,రంజిత్ రావు, ఆత్మకూరు, పరకాల సిఐ క్రాంతి కుమార్, శాయంపేట ఎస్సై జక్కులపరమేష్, పరకాల ఎస్ఐ రమేష్, పవన్, దామెర ఎస్సై కొంక అశోక్, ఆత్మకూరు ఎస్సైతిరుపతి, పోలీస్ సిబ్బంది మరియు మండల రిపోర్టర్లు పాల్గొన్నారు
