చలో బొంబాయి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి…

చలో బొంబాయి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి

నేటి ధాత్రి అయినవోలు

ఎంఆర్పిఎస్, ఎంఎస్పీ అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించనున్న “చలో బొంబాయి” కార్యక్రమాన్ని విజయవంతం చేయాలనే లక్ష్యంతో మండల కన్వీనర్ బరిగల ఏలియా అధ్యక్షతన ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించబడింది.

ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా సీనియర్ నాయకులు, ఎంఎస్పీ జిల్లా ప్రధాన కార్యదర్శి బోక్కల నారాయణ మాదిగ గారు హాజరై మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ ఏప్రిల్ 7, 2026న జరగనున్న “చలో బొంబాయి” కార్యక్రమం ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉందని, మండలంలోని అన్ని రాజకీయ పార్టీలు, ప్రజలు కలసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా మండలంలోని ప్రజలందరూ పూర్తి స్థాయిలో సహకరించి కార్యక్రమం విజయవంతం కావడానికి కృషి చేయాలని నాయకులు కోరారు.ఈ సమావేశంలో మండల ఉపాధ్యక్షులు బొక్కల అనిల్ మాదిగ, సీనియర్ నాయకులు బర్ల బాబు మాదిగ, ఆరూరి కుమారస్వామి మాదిగ, మండల అధికార ప్రతినిధి సింగారపు చంద్రమౌళి మాదిగ, అయినవోలు అధ్యక్షులు మొలుగురి సంజీవ మాదిగ, ఇదా భాస్కర్ మాదిగ, బారిగల కుమార్ మాదిగ, కొత్తూరు ఎస్పాల్ మాదిగ తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version