బడ్జెట్ వేళ మరింత దిగువకు బంగారం, వెండి ధరలు
బులియన్ మార్కెట్లో భారీ పతనం నమోదవుతోంది. నేడు బడ్జెట్ ప్రత్యేక ట్రేడింగ్ సెషన్లో బంగారం, వెండి ధరల పరిస్థితి మరింత దిగజారింది. దీంతో వరుసగా మూడో రోజు కూడా బంగారం, వెండి ధరలు నేలకు దిగివస్తున్నాయి.
2026 కేంద్ర బడ్జెట్ ప్రవేశపెడుతున్న వేళ బులియన్ మార్కెట్లో ప్రకంపనలు కొనసాగుతున్నాయి. కొన్ని రోజులుగా ఆకాశమే హద్దుగా దూసుకుపోయిన బంగారం, వెండి ధరలు.. వరుసగా మూడో రోజూ అంతే వేగంతో నేలకు దిగివస్తున్నాయి. ముఖ్యంగా మల్టీ కమొడిటీ ఎక్స్ఛేంజీ(MCX)లో ధరలు భారీగా పతనం కావడం ఇన్వెస్టర్లను విస్మయానికి గురిచేస్తోంది.
బంగారం ధర: ఇవాళ MCXలో 10 గ్రాముల బంగారం ఏప్రిల్ ఫ్యూచర్స్ సుమారు 9 శాతం వరకు పడిపోయి లోయర్ సర్క్యూట్‌ను తాకింది. ఒక దశలో ఇది రూ.1,43,205 వద్ద ట్రేడ్ అయింది. అంటే రికార్డు స్థాయి(రూ1,93,000+) నుంచి కేవలం మూడు రోజుల్లోనే దాదాపు రూ. 50,000 వరకు తగ్గింది.
వెండి ధర: వెండి పరిస్థితి మరింత దారుణంగా ఉంది. కిలో వెండి ధర సుమారు రూ.1,25,000 వరకు పతనమై, రూ. 2,74,410 వద్ద ట్రేడ్ అవుతోంది.
నగరాల్లో స్పాట్ ధరలు:
హైదరాబాద్, బెంగళూరు వంటి నగరాల్లో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.1,60,580 ప్రాంతంలో ఉండగా, నిన్నటితో పోలిస్తే భారీ తగ్గుదల కనిపిస్తోంది.
