యాసంగి సీజన్ ముగుస్తుంది. లక్షల మంది రైతులు రైతు భరోసా కోసం ఎదురుచూస్తున్నారు.
బి ఆర్ఎస్ పార్టీ మండల ఉపాధ్యక్షులు
దేవునూరి కుమార్ మొగుళ్లపల్లి నేటి ధాత్రి.
భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలంలో విలేకరుల సమావేశంలో బిఆర్ఎస్ పార్టీ మండల ఉపాధ్యక్షులు దేవునూరి కుమార్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో రైతుబంధు ఎప్పుడు ఇస్తారని తెలంగాణ రైతులు 70 లక్షల మంది రైతులు ఎదురుచూస్తున్నారని ఇంకా యాసంగి సీజన్18 రోజులే మిగిలి ఉంది రైతుల ఖాతాలో రైతు బంధు డబ్బులు ఇంకెప్పుడు వేస్తారని రైతులు ఎదురుచూస్తున్నారు బి ఆర్ఎస్ ప్రభుత్వంలో అప్పుల కోసం చూడని రైతులు కాంగ్రెస్ సర్కార్ రైతు వ్యతిరేక నిర్ణయాలతో పంట పెట్టుబడి కోసం మళ్ళీ అప్లు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది బి ఆర్ఎస్ ప్రభుత్వంలో లో సీజన్ ప్రారంభానికి ముందే విత్తనాలు ఎరువులు కొనుగోలు చేసేందుకు రైతుబంధు సాయాన్ని అందజేయగా ప్రస్తుత రైతు భరోసా సాయం కోసం ఎదురు చూడాల్సిన దయనీయ పరిస్థితులు నెలకొన్నాయి సకాలంలో సాయం అందకపోవడంతో పాటు మరోవైపు అప్పులు దొరకక తీవ్ర కష్టాలు పడుతున్నారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన అనంతరం అన్ని వర్గాల ప్రజలకు కష్టాలు మొదలయ్యాయి సబ్బండ వర్గాల ప్రజలకు ఎన్నికల ముందు హామీలు ఇచ్చి మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యంగా రైతులను నట్టేట ముంచింది. బి ఆర్ఎస్ సర్కార్ హయాములో పదేళ్లపాటు ప్రతి సీజన్ ముందే పెట్టుబడి సాయం అందించి అప్పుల్లో కూరుకపోయిన అన్నదాతలను ఆర్థికంగా నిలదొక్కుకునేలా చేసింది సీజన్ కు ఒక మాట చెబుతూ రైతులకు న్యాయం వస్తున్న ప్రభుత్వం యాసంగి సీజన్ పూర్తికావస్తున్న పెట్టుబడి సాయం ఎప్పుడు అందిస్తారని దానిపై నిర్ణయం తీసుకోలేదని పెట్టుబడి సాయం సమయానికి అందకపోవడంతో చాలా మంది పేద అన్నదాతలు తమకున్న ఎకరా రెండు ఎకరాల పొలంలో పంట సాగు చేయకుండా బీడు గానే ఉంచుతున్నారు
