చేర్యాల బస్టాండుకు దాతల పేర్లు వారి విగ్రహాలు పెట్టాలి..

చేర్యాల బస్టాండుకు దాతల పేర్లు వారి విగ్రహాలు పెట్టాలి

చేర్యాల ఆర్టీసీ స్థలాన్ని ఆర్టీసీ అభివృద్ధి పనులకే వినియోగించాలి

దాతలు గుళ్ళపల్లి తిరుమల యాదగిరిరావు వారసులు

చేర్యాల నేటిధాత్రి

 

చేర్యాల మున్సిపల్ పరిధిలో గల ఆర్టీసీ బస్టాండ్ కు దాతలు గుళ్ళపల్లి యాదగిరిరావు కల్వకోట సురేందర్ రావు గార్లు ఆర్టీసీ బస్టాండ్ కు భూమిని విరాళంగా ఇచ్చారు దానిలో ఆర్టీసీకి మాత్రమే వినియోగించాలని వారి కోరిక ఇప్పుడు ఇతర నిర్మాణాలు అందులో చేపడుతున్నారని చేపట్టకూడదని, అలాగే భూమిని దానపూర్వకంగా ఇచ్చిన గుళ్ళపల్లి తిరుమల యాదగిరి రావు, కల్వకోట సురేందర్ రావు ల విగ్రహాలు ఏర్పాటు చేసి ప్రయాణ ప్రాంగణానికి వారి పేర్లను పెట్టాలని దాతల కుటుంబ సభ్యులు కోరారు. ఈ మేరకు హైద్రాబాద్ లోని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కార్యాలయం ‘ బస్ భవన్ ‘ లో కార్పొరేషన్ వైస్ చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ వై. నాగిరెడ్డి గారిని కలిసిన కుటుంబ సభ్యులైన గుళ్ళపల్లి తిరుమల కాంతికృష్ణ, కల్వకోట రాజేశ్వర్ రావు లు విజ్ఞాపన పత్రం అందజేశారు. తమ తండ్రి,తాతలు ప్రయాణీకుల సౌకర్యం కొరకు బస్ స్టేషన్ నిర్మాణానికి స్థలాన్ని దానం చేశారని,కానీ అందులో కొత్తగా వాటర్ ట్యాంక్ నిర్మాణంకోసం పనులను మొదలుపెట్టారని, దీనివలన బస్ లు తిరగడానికి భవిష్యత్ ప్లాట్ ఫారం ల విస్తరణకు ఆటంకం కలిగి తమ పెద్దల ఆశయం నెరవేరదని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
కోట్ల రూపాయల విలువైన భూమిని తమ పెద్దలు ఇచ్చినప్పటికీ వారి పేర్లను కూడా ప్రదర్శించలేదని, ప్రారంభం చేసిన రాజకీయనాయకుల పేర్లు మాత్రం పెద్దగా శిలాఫలకాలపై రాశారని, భవిష్యత్ తరాలకు తెలిసేవిధంగా ఇప్పటికైనా ప్రయాణ ప్రాంగణానికి దాతల పేర్లను పెట్టి వారిని గౌరవించాలని వారు కోరారు. ఇదే విషయాన్ని ఫోన్ ద్వారా మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారి దృష్టికి తీసుకువెళ్లామని మరియు చేర్యాల మున్సిపల్ పరిధిలో భూదాత గా పేరుపొందిన గుళ్ళపల్లి తిరుమల యాదగిరిరావు కల్వకోట సురేందర్ రావు విగ్రహాలు చేర్యాల నడిబొడ్డున పెట్టి వారిని గౌరవించాల్సిన బాధ్యత అందరిపై ఉంది

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version