ఆపరేషన్ స్మైల్ పకడ్బందీగా అమలు

ఆపరేషన్ స్మైల్ పకడ్బందీగా నిర్వహిద్దాం

అదనపు ఎస్పీ చంద్రయ్య.

సిరిసిల్ల టౌన్ : ( నేటిధాత్రి)

 

 

 

సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని ఈ రోజున జిల్లా పోలీస్ కార్యలయంలో అపరేషన్ స్మైల్ టీమ్, వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి జిల్లాలో ఉన్న పరిశ్రమలు,హోటల్స్ , వ్యాపార సముదాయాలు,గోదాములు,మెకానిక్ షాపులు,హోటల్స్, ఇటుక బట్టిలు తదితర ప్రాంతాల్లో వ్యూహాత్మక ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించి ఆపరేషన్ స్మైల్ పకడ్బందీగా నిర్వహించాలని ఆదేశించిన అదనపు ఎస్పీ.

 

ఈసందర్భంగా అదనపు ఎస్పీ మాట్లాడుతూ…బాలకార్మిక వ్యవస్థను నిర్మూలించడానికి కేంద్ర ప్రభుత్వం సంవత్సరంలో రెండు సార్లు ఆపరేషన్ స్మైల్, ఆపరేషన్ ముస్కాన్ అనే కార్యక్రమాలను నిర్వహించి తప్పిపోయిన బాలలను గుర్తించి వారి తల్లిదండ్రుల వద్దకు చేర్చేలా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని అందులో భాగంగా జిల్లాలో ఆపరేషన్ స్మైల్ విజయవంతం కోసం అన్ని శాఖల
సమన్వయంతో పకడ్బందీగా నిర్వహిస్తున్నామని,గడిచిన 13 రోజులలో ప్రభుత్వేతర స్వచ్చంద సంస్థలను గుర్తించి విస్తృతంగా తనిఖీలు నిర్వహించి జిల్లా వ్యాప్తంగా 28 మంది పిల్లలని గుర్తించి వారి యొక్క తల్లిదండ్రుల వద్దకు చేర్చడం జరిగిందని,18 సంవత్సరాల లోపు పిల్లలను పనిలో పెట్టుకుని వారితో పని చేయిస్తున్న వారిపై 03 కేసులు నమోదు చేయడం జరిగిందన్నారు.
ఈ సమావేశంలో DWO లక్ష్మీ రాజాం,cwc చైర్పర్సన్ అంజయ్య,ఎస్.ఐ లు ఎల్లగౌడ్,లక్పతి,మెడికల్ &హెల్త్ నుండి నయుమ్ జహార్,ఏ ఏఎస్ఐ ప్రమీల,మహిళా కానిస్టేబుల్స్ శ్రీలత, ప్రియాంక, కానిస్టేబుల్స్ గంగరాజం, శ్రీనివాస్,అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version