గుడ్ న్యూస్.. వడ్డీ రేట్లపై మరో 0.25 శాతం కోత విధించిన ఆర్బీఐ
ఆర్బీఐ మరోసారి గుడ్ న్యూస్ చెప్పింది. కీలక వడ్డీ రేట్లను మరో 25 బేసిస్ పాయింట్ల మేర తగ్గిస్తున్నట్టు తాజాగా ప్రకటించింది.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) మరోసారి గుడ్ న్యూస్ ప్రకటించింది. కీలక వడ్డీ రేట్లను(RBI Interest Rates) మరో 25 బేసిస్ పాయింట్ల మేర తగ్గిస్తున్నట్టు పేర్కొంది. దీంతో రెపో రేటు 5.25 శాతానికి దిగొచ్చింది. ఈ మేరకు ద్రవ్య పరపతి విధాన సమీక్ష నిర్ణయాలను ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా(RBI Governor Sanjay Malhotra) శుక్రవారం వెల్లడించారు
అయితే.. ఈ ఏడాదిలో ఇప్పటికే వడ్డీ రేట్లపై ట్రిపుల్ బొనాంజా ప్రకటించింది ఆర్బీఐ. ఫిబ్రవరి, ఏప్రిల్ నెలల్లో కీలక వడ్డీరేట్లపై 25 బేసిస్ పాయింట్ల మేర తగ్గించింది. ఆ తర్వాత జూన్ నెలలో మరోసారి ఏకంగా 50 పాయింట్ల మేర కోత విధించింది. దీంతో 2025 ఏడాదిలోనే మొత్తం రెపో రేటు 1.25 మేర తగ్గింది.
