రైతులను పరామర్శించేందుకు పంజాబ్‌లో 9న మోదీ పర్యటన…

 రైతులను పరామర్శించేందుకు పంజాబ్‌లో 9న మోదీ పర్యటన

 

 

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎల్లప్పుడూ పంజాబ్ ప్రజలకు అండగా నిలుస్తుందని, కష్టకాలంలో పూర్తి సహకారాన్ని అందిస్తుందని, ఇందుకు ప్రధాని పంజాబ్‌లో పర్యటించనుండటమే నిదర్శనమని బీజేపీ పంజాబ్ యూనిట్ తెలిపింది.

న్యూఢిల్లీ: పంజాబ్‌లో గత ఏభై ఏళ్లలో కనీవినీ ఎరుగని విధంగా వరదలు బీభత్సం సృష్టించడం, పెద్దఎత్తున ఆస్తి, పంటనష్టం సంభవించడం, లెక్కకు మిక్కిలిగా నిరాశ్రయులు కావడంతో ఆ రాష్ట్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi) పర్యటించనున్నారు. సహాయ, పునరావాస కార్యక్రమాలు, అక్కడి పరిస్థితిని సమీక్షించేందుకు సెప్టెంబర్ 9న ఆయన పంజాబ్‌లో పర్యటించనున్నట్టు బీజేపీ పంజాబ్ విభాగం సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో తెలిపింది. గురుదాస్‌పూర్‌లో ప్రధాని పర్యటించి వరద బాధిత ప్రజలు, రైతులను కలుసుకుంటారని పేర్కొంది. బాధితులను ఆదుకునేందుకు అవసరమైన అన్ని చర్యలూ తీసుకుంటారని వివరించింది.

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎల్లప్పుడూ పంజాబ్ ప్రజలకు అండగా నిలుస్తుందని, కష్టకాలంలో పూర్తి సహకారాన్ని అందిస్తుందని, ఇందుకు ప్రధాని పంజాబ్‌లో పర్యటించనుండటమే నిదర్శనమని బీజేపీ పంజాబ్ యూనిట్ తెలిపింది.

పంజాబ్ వరదలు

కాగా, ప్రధాన మంత్రి వర్షబాధిత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో పర్యటించనున్నట్టు ప్రభుత్వ వర్గాలు ఇంతకుముందు తెలిపాయి. జమ్మూకశ్మీర్, గుజరాత్, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్‌లో పర్యటించి వరద పరిస్థితి, సహాయ కార్యక్రమాలను సమీక్షిస్తారని పేర్కొన్నాయి. తూర్పు భారతదేశంలో ఎడతెరిపి లేని వర్షాలు, మెరుపు వరదలు, కొండచరియలు విరిగిపడి 500 మందికి పైగా ప్రాణాలు కోల్పోయినట్టు ఆ వర్గాలు వెల్లడించాయి. కాగా, వరదల ప్రభావం పంజాబ్ రాష్ట్రంపై తీవ్రంగా ఉంది. సుమారు 1,650 గ్రామాలు జలదిగ్బంధంలో ఉన్నారు. 1.75 లక్షల హెకార్ట పంట దెబ్బతింది. బియాస్, సట్లజ్, రావి, ఘగ్గర్ నదులు ప్రమాద స్థాయిని మించి ప్రవహిస్తున్నాయి. గురుదాస్‌పూర్ జిల్లాపై ఈ ప్రభావం ఎక్కువగా ఉంది. 1.45 లక్షల నివాసులపై ప్రభావం పడింది. ఆ తర్వాత వరదల ప్రభావం ఎక్కువగా ఉన్న జిల్లాల్లో అమృత్‌సర్, ఫిరోజ్‌పూర్, ఫజిల్కా ఉన్నాయి. పంజాబ్‌లో 37 మంది మరణించగా, ముగ్గురి జాడ గల్లంతైంది. సెప్టెబర్ 7 వరకూ అన్ని విద్యాసంస్థలను మూసేశారు. ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, బీఎస్ఎఫ్, ఎన్‌డీఆర్‌ఎఫ్ యుద్ధ ప్రాతిపదికన సహాయక కార్యక్రమాలు కొనసాగిస్తున్నాయి. గత ఐదురోజులుగా పంజాబ్‌లో వర్షాలు పడుతుండటంతో పరిస్థితి మరింత విషమిస్తోంది.

సోనూసూద్ గొప్ప మనసు.. ప్రాణాలకు రిస్క్ అని తెలిసినా కూడా..

సోనూసూద్ గొప్ప మనసు.. ప్రాణాలకు రిస్క్ అని తెలిసినా కూడా..

పంజాబ్‌లోని వరద ప్రభావిత గ్రామాల పరిస్థితి దారుణంగా ఉంది. దాదాపు 1998 గ్రామాలు తీవ్రంగా నష్టపోయాయి. 48 మంది ప్రజలు చనిపోయారు.

సోనూసూద్ మంచితనం గురించి ఎంత చెప్పినా తక్కువే. ప్రపంచ దేశాలను గడగడలాడించిన కోవిడ్ మహమ్మారి సమయం నుంచి ఇప్పటి వరకు లేదనకుండా అడిగిన వారికి సాయం చేస్తూనే ఉన్నారు. తన అవసరం ఉన్న చోటుకు నేరుగా వెళుతున్నారు. స్వయంగా తన చేతుల్తోనే సాయం చేసి వస్తున్నారు. ప్రస్తుతం ఆయన పంజాబ్‌లో ఉన్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. వరదల కారణంగా నష్టపోయిన గ్రామాల్లో పర్యటించటమే కాకుండా సాయం కూడా అందించనున్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ..

‘భాగ్‌పూర్, సుల్తాన్ పూర్, లోధి, పిరోజ్‌పూర్, ఫలిల్కా, అజ్‌నాలకు వెళతాను. ఆ ప్రాంతాల్లో తిరిగి అక్కడి పరిస్థితులను తెలుసుకుంటాను. వర్షాల కారణంగా ఇళ్లు కూలిపోయాయి. ప్రజలు అన్ని రకాలుగా దెబ్బతిన్నారు. ఇక్కడి ప్రజలకు సాయం చేయటం అన్నది వారంలోనో.. పది రోజుల్లోనే అయ్యే పని కాదు. పంజాబ్ కోలుకోవటానికి కొన్ని నెలల సమయం పడుతుంది. పంజాబ్ కోసం నిలబడే వారు మాకు చాలా అవసరం. ఇళ్లు కూలిపోయి ఇబ్బంది పడుతున్నవారికి మేము ఇళ్లు కట్టించే ప్రయత్నం చేస్తాం.

నేను ఇప్పుడే వెనక్కు తిరిగి వెళ్లిపోవడానికి రాలేదు. వీలైనన్ని వరద ప్రభావిత గ్రామాల్లో పర్యటిస్తాను’ అని స్పష్టం చేశారు. కాగా, పంజాబ్‌లోని వరద ప్రభావిత గ్రామాల పరిస్థితి దారుణంగా ఉంది. దాదాపు 1998 గ్రామాలు తీవ్రంగా నష్టపోయాయి. 48 మంది ప్రజలు చనిపోయారు. 1.45 లక్షల మంది ప్రజలపై వరద ప్రభావం పడింది. భారీగా పంట నష్టం కూడా సంభవించింది. 50 ఏళ్ల తర్వాత రాష్ట్రంలో వరదలు బీభత్సం సృష్టించాయి. అక్కడ పరిస్థితులు ఇంకా సాధారణ స్థితిలోకి రాలేదు. వర్షం పడుతూనే ఉంది. ఇలాంటి సమయంలో అక్కడికి వెళ్లటం రిస్క్ అని తెలిసినా సోనూసూద్ వెనకడుగు వేయటం లేదు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version