బ్యాట్ ఈసీ మెంబర్ గా పుల్లూరి సుధాకర్

బ్యాట్ ఈసీ మెంబర్ గా పుల్లూరి సుధాకర్

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ( బ్యాట్) ఎగ్జిక్యూటివ్ మెంబర్ గా స్టార్ మంచిర్యాల జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి పుల్లూరి సుధాకర్ ఏప్రిల్ 21వ తేదీ మంగళవారం రోజున హైదరాబాదులోని పుల్లెల గోపీచంద్ బ్యాడ్మింటన్ న్ అకాడమీలో జరిగిన ఎలక్షన్లో బ్యాట్ కమిటీ ఏకగ్రీవంగా ఎన్నిక కాగా ఇందులో రామకృష్ణాపూర్ పట్టణానికి చెందిన పుల్లూరి సుధాకర్ కూడా ఈసీ మెంబర్ గా ఎన్నికయ్యారు. ఎన్నికైన నూతన కమిటీ నాలుగు సంవత్సరాలు కొనసాగనున్నారు. ఈ సందర్భంగా పుల్లూరి సుధాకర్ మాట్లాడుతూ ప్రెసిడెంట్ రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ప్రధాన కార్యదర్శి పుల్లెల గోపీచంద్, వైస్ ప్రెసిడెంట్ ఉపేందర్ రావు లకు, కమిటీ సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. బ్యాట్ ఈసీ మెంబర్ గా ఎన్నికైన పుల్లూరి సుధాకర్ ని జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షుడు గాజుల ముఖేష్ గౌడ్, ఉపాధ్యక్షులు భాస్కర్ల వాసు, బండ మీనా రెడ్డి, జాయింట్ సెక్రెటరీ రమేష్ రెడ్డి, ట్రెజరర్ సత్యపాల్ రెడ్డి,ఈసీ మెంబర్లు, సీనియర్ క్రీడాకారులు ప్రత్యేకంగా అభినందించారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version