ఆర్టీసీ యాత్రాధానం..మానవసంబంధాలకు వారధి
నర్సంపేట డిపో మేనేజర్ ప్రసూనలక్ష్మీ
నర్సంపేట,నేటిధాత్రి:
ఆర్టీసీయాత్రాధానం..మానవసంబంధాలకు వారధి…మానవత్వపు బహుమతి అని దాతలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి యాత్రాదానం అనే మహోన్నత కార్యక్రమంలో భాగస్వాములు కావాలని నర్సంపేట ఆర్టీసీ డిపో మేనేజర్ ప్రసూనలక్ష్మీ కోరారు.ఈ కార్యక్రమం ద్వారా అనాథలు, నిరాశ్రయ వృద్ధులు, దివ్యాంగులు, నిరుపేద విద్యార్థులు ప్రసిద్ధ దేవాలయాలు, పర్యాటక ప్రదేశాలు, విహారయాత్రలకు వెళ్లే అవకాశం పొందుతారు అని అన్నారు.సంతోషకరమైన రోజుల్లో ఈ యాత్ర ద్వారా ఇతరులలోనూ ఆనందాన్ని పంచుకోవ చ్చు.సమాజహితానికి ప్రజాప్రతినిధులు, కార్పొరేట్ సంస్థలు, ఎన్టీవోలు ఈ యాత్రాదానం కార్యక్రమాన్ని వినియోగించుకోవాలని కోరారు.ప్రజలకు మెరుగైన రవాణా సేవలను అందించడంతో పాటు సామాజిక బాధ్యత గల సంస్థగా ముందుకు వచ్చి యాత్రాదానం కార్యక్రమాన్ని ఆర్టీసీ ప్రారంభించిందన్నారు. యాత్రాదానం బస్సుల బుకింగ్ కోసం నర్సంపేట డిపో 9959226052, 9866314253 నెంబర్లను సంప్రదించగలరని డిపో మేనేజర్ ప్రసూనలక్ష్మీ తెలిపినారు.