పరకాలలో రోడ్డు ప్రమాదం

పరకాలలో రోడ్డు ప్రమాదం

నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తికి గాయాలు

పరకాల,నేటిధాత్రి

భూపాలపల్లి నుండి పరకాలకు వస్తున్న ఓ కారు, రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తిని వెనుక నుంచి ఢీకొన్న ఘటన గురువారం మధ్యాహ్నం చోటుచేసుకుంది.పేరాల కుమారస్వామి అనే వ్యక్తి ఈ ప్రమాదంలో తలకు,కాళ్లకు స్వల్ప గాయాలు పొందినట్లు సమాచారం.ఘటనను గమనించిన స్థానికులు వెంటనే 108 అత్యవసర సేవలకు సమాచారం అందించారు.సంఘటన స్థలానికి చేరుకున్న 108 సిబ్బంది ఈఎంటి మహేందర్,పైలట్ విజయ్ భాస్కర్ గాయపడిన వ్యక్తికి ప్రథమ చికిత్స అందించి సమీప ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.ప్రాథమిక సమాచారం ప్రకారం,గాయపడిన వ్యక్తి మద్యం మత్తులో ఉన్నట్లు తెలిసింది.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version