రెడ్లకుంటలో ఐకెపి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం.

రెడ్లకుంటలో ఐకెపి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం.

కోదాడ, నేటి ధాత్రి:

మండల పరిధిలోని రెడ్లకుంట గ్రామంలో రైతుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన ఐకెపి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని శుక్రవారం గ్రామ సర్పంచ్ పోల్లంపల్లి కుటుంబరావు, ఉప సర్పంచ్ మల్లెల ప్రసాదరావు లు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు పూర్తిగా వినియోగించుకోవాలని సూచించారు. దళారులను నమ్మి తక్కువ ధరలకు ధాన్యం అమ్మి నష్టపోకూడదని రైతులకు హితవు పలికారు. రైతులకు సరైన ధర లభించేందుకు, పారదర్శకంగా కొనుగోళ్లు జరగేందుకు ఐకెపి కేంద్రాలు ముఖ్యపాత్ర పోషిస్తాయని తెలిపారు. ఐకెపి కేంద్రాల్లో తూకాల్లో ఎలాంటి అవకతవకలు లేకుండా రైతులకు న్యాయం చేయాలని, ప్రతి రైతుకు సరైన సేవలు అందేలా అధికారులు కృషి చేయాలని కోరారు. అలాగే కేంద్రాల్లో త్రాగునీరు, టెంట్లు, విశ్రాంతి కోసం సౌకర్యాలు వంటి మౌలిక వసతులు కల్పించాలని నిర్వాహకులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఏపీఎం వెంకన్న, కార్యదర్శి నాగలక్ష్మి, చిన్న, ఝాన్సీ, లక్ష్మీబాయి, సువర్ణ, నాగమణి, విజయలక్ష్మి, విజయ రాణి, సౌజన్య, మౌనిక తదితర మహిళా సంఘ సభ్యులు పాల్గొన్నారు. అలాగే గ్రామ రైతులు మల్లయ్య, నారాయణరావు, రవి, రామారావు, లింగయ్య, అంజయ్య, టీంకు, తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version