తిరుపతిని సన్మానిస్తున్న ఎన్యూజేఐ జాతీయ అధ్యక్షులు సురేష్ శర్మ

తిరుపతిని సన్మానిస్తున్న ఎన్యూజేఐ జాతీయ అధ్యక్షులు సురేష్ శర్మ

టీఎస్ జేయు జిల్లా సంయుక్త కార్యదర్శిగా బెల్లం తిరుపతి

భూపాలపల్లి నేటిధాత్రి

 

హైదరాబాదులోని ఆర్టీసీ క్రాస్ రోడ్ లో నేషనల్ యూనియన్ ఆఫ్ జర్నలిస్టు ఇండియా వారి జాతీయ కార్యవర్గ సమావేశం అనంతరం టీఎస్ జేయు రాష్ట్ర అధ్యక్ష,కార్యదర్శులు పురుషోత్తం నారగోని, తోకల అనిల్ కుమార్, స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ పావుశెట్టి శ్రీనివాస్ ఆధ్వర్యంలో బెల్లం తిరుపతిని టీఎస్ జేయు జయశంకర్ భూపాలపల్లి జిల్లా సంయుక్త కార్యదర్శి ప్రకటించడం జరిగింది. అనంతరం యూనియన్ జాతీయ అధ్యక్షులు సురేష్ శర్మ శాలువాతో సన్మానించారు. బెల్లం తిరుపతి జిల్లా సంయుక్త కార్యదర్శిగా ప్రకటించిన సందర్భంగా టీఎస్ జె యు కుటుంబ సభ్యులందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్టేట్ సంయుక్త కార్యదర్శి తడుక సుధాకర్, భూపాలపల్లి జిల్లా అధ్యక్షులు ఎడ్ల సంతోష్, ప్రధాన కార్యదర్శి దొమ్మటి రవీందర్ తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version